సీఎం జగన్ రెండో తేదీన లండన్ వెళ్లారు. ఆరో తేదీ వచ్చింది. జగన్ లండన్ చేరుకున్నట్లుగా ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. జగన్ రెడ్డిది పూర్తిగా వ్యక్తిగత పర్యటన. అయితే ఆయన ముఖ్యమంత్రి. ఆయన పర్యటనలపై సమాచారం ప్రజలకు అందేలా చూసేందుకు యంత్రాంగం ఉంటుంది. లగ్జరీ విమానంలో లండన్ బయలుదేరిన జగన్ రెడ్డి… హిత్రూ ఎయిర్ పోర్టులో దిగలేదని ఫ్లైట్ ట్రాకింగ్ నిపుణులు కొంత మంది సోషల్ మీడియాలో చెబుతున్నారు. ప్రైవేటు ఎయిర్ పోర్టులో దిగి ఉండవచ్చునని అంటున్నారు.
ముఖ్యమంత్రి అయినా.. ప్రతిపక్ష నేత అయినా… ఎంత ప్రైవేట్ ట్రిప్ అయినా విదేశాలకు వెళ్తే.. అక్కడ ఎన్నారై అనుబంధ సంఘాలు వెళ్లి రిసీవ్ చేసుకుంటాయి. అది కామన్. ఎందుకంటే వారు ప్రజా జీవితంలో ఉన్నారు. దేశంలో కాని దేశంలో తను వెళ్తున్న చోటకు తమ వారు ఉన్నారంటే పలకరించాలని వారికీ ఉంటుంది.. వారి స్వాగతం పొందాలని వీరికీ ఉంటుంది. కానీ జగన్ పర్యటనలో అలాంటి స్వాగతాలు కూడా ఏమీ లేదు. అదే సమయంలో ఒక స్టేట్ సీఎం వచ్చారు అంటే ఎక్కడో ఒకచోట మీట్ అండ్ గ్రీట్ లాంటివి పెట్టుకుంటారు. సీఎం జగన్ టూర్ లో అలాంటివి ఏమైనా ఉన్నాయని ఎక్కడా బయటకు రాలేదు.
లండన్ లో భారతీయులు.. ముఖ్యంగా తెలుగు వాళ్లు ఎక్కువగానే ఉంటారు. వారిలో వైసీపీ ఫ్యాన్స్ కూడా ఉంటారు. మీట్ అండ్ గ్రీట్ లు పెట్టుకోవచ్చు అనే సంకేతం పంపితే ధూంధాంగా చేసేస్తారు. కానీ … తన పర్యటనను జగన్ రెడ్డి సీక్రెట్ గా ఉంచాలనుకున్నారు. అందుకే ఆయన ఎక్కడెక్కడ పర్యటిస్తున్నారో కూడా ఎవరికీ తెలియకుండా సాగుతోంది.
భారత్ లో ఆర్థిక నేరాలకు పాల్పడిన చాలా మంది లండన్ లోనే ఆశ్రయం పొందుతున్నారు. నిరవ్ మోదీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా సహా చాలా మందికి లండన్ సేఫ్ ప్లేస్ గా ఉంది. అక్కడి చట్టాల వల్ల ఇది సాధ్యమవుతోంది.