తెలుగుదేశం పార్టీ నేతలందరూ బీఆర్ఎస్ లో చేరిపోయారు. కొంత మంది బీజేపీలో చేరారు. కానీ కాంగ్రెస్ లో చేరిన వారు చాలా తక్కువ. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అప్పట్లో బాగోలేకపోవడంతో ఎవరూ ఆ పార్టీ వైపు చూడటం లేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. కాంగ్రెస్ బలంగా కనిపిస్తోంది . టీడీపీ నుంచే వెళ్లిన రేవంత్ రెడ్డి చీఫ్ గా ఉన్నారు. దీంతో రాజకీయంగా తామున్న పార్టీలో ప్రాధాన్యం లేని నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని ఆహ్వానిస్తున్నారు.
తుమ్మల నాగేశ్వరరావు … షర్మిల అంశంపై కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వగానే కాంగ్రెస్ లో చేరుతారు. మండవ వెంకటేశ్వరరావును కూడా రేవంత్ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. ఇటీవల మక్తల్, దేవకద్ర నియోజకవర్గాలకు చెందిన సీత దయాకర్ రెడ్డి కూడా రేవంత్ తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ లోచేరాలని వారు టీడీపీకి రాజీనామా చేశారు. కానీ దయాకర్ రెడ్డి అనారోగ్యం కారణంగా సైలెంట్ అయ్యారు. ఇటీవల ఆయన చనిపోయారు.
హైదరాబాద్ సిటీలో బలమైన టీడీపీ నేతల్ని ఆకర్షించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. వారిలో కొంత మంది ఇప్పటికే బీఆర్ఎస్ లో చేరారు. మరికొంత మందిని తాను ఆహ్వానిస్తున్నారు. ఎంఎన్ శ్రీనివాస్,, కూన వెంకటేశం గౌడ్ వంటి వారితో చర్చలు జరుపుతున్నారు. టీడీపీలో పని చేసిన నేతలతో… రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలు ఉంటాయి. వారిని ఆకర్షిస్తున్నారు. బీఆర్ఎస్ లో ఉండి నిరాదరణకు గురైన నేతలు ఎన్నికల సమయంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు.