ఓ వ్యక్తి తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేశాడు. తనపై దాడి చేసిన వారిని శిక్షించాలన్నాడు. దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేశాయి. కోర్టులో పెట్టాయి. ఇప్పుడు న్యాయమూర్తి ముందు సాక్ష్యం చెప్పడానికి ఆ బాధితుడు రాకపోతే ఏమనుకోవాలి ?. కోర్టుకు వచ్చి సాక్ష్యం ఇస్తే… అక్కడ జరిగే క్రాస్ ఎగ్జామినేన్ లో దొరికిపోతానేమోనన్న భయంతో రాకుండా ఉండాలి. లేకపోతే అంతకు మించిన కుట్రదాడులు ఆయనే అయి ఉండాలి. ఇప్పుడు కోడి కత్తి కేసులో అదే జరుగుతోంది. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పేందుకు జగన్ రెడ్డి నిరాకరిస్తున్నారు.
నిందితుడిగా కోర్టుకు వెళ్లడానికి జగన్ రెడ్డి అనేక రకాల పిటిషన్లు వేస్తున్నారు. పన్నెండేళ్లుగా బెయిల్ పై ఉన్న నేతగా రికార్డు సృష్టిస్తున్నారు. అదే బాధితుడిగా ఉన్న కేసులో కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి ? తనపై జరిగిన దాడి కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేయరా ?. ఎందుకు జగన్ రెడ్డి కోర్టుకు డుమ్మా కొడుతున్నారు ? ఇది పెద్ద సస్పెన్స్ అవుతోంది. కోడి కత్తి కేసు నిందితుడు తరపు లాయర్ సలీం బయటపెడుతున్న సంచలన వాస్తవాలు జగన్ రెడ్డిపై అనేక అనుమానాలను పెంచుతున్నాయి.
తనపై కోడికత్తితో దాడి చేశారని జగన్ రెడ్డి కోర్టుకు వచ్చి చెప్పాలి. ఎలా దాడి చేశారో చెప్పాలి. ఎంత గాయం అయిందో చెప్పాలి. మెడికల్ రిపోర్టులు సమర్పించాలి. కానీ ఇక్కడ జరిగిందంతా ఫేక్ ఎటాక్ స్టోరీ. అసలు దాడి జరిగిందని ప్రచారం చేసిన వారంతా వైసీపీ నేతలే. అందులో కోడికత్తి .. బొత్స బందువు దగ్గర ఉంది. సీసీ టీవీ ఫుటేజీ లేదు. ఇలా మొత్తంగా ఓ పకడ్బందీ కుట్ర ప్రకారం.. ఈ వ్యవహారాన్ని నడిపారు. దర్యాప్తు చేస్తోంది ఎన్ఐఏ కాబట్టి… ఇక బొక్కలు వెతకాల్సిన పని లేదు. కానీ ఎన్ఐఏ విచారణ… దాడి వెనుక కుట్ర ఉందా లేదా అన్న వరకే జరిగింది.
కానీ కోర్టు విచారణలో… జగన్ రెడ్డి చేయించుకున్న వైద్యం సహా అన్నీ బయటకు వస్తాయి. అందుకే ఆయన కోర్టుకు రావడం లేదు. అంటే… అసలైన నిందితుడు ఆయనేనని సులువుగా అర్థం చేసుకోవచ్చు.