తెలంగాణలో మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి. పదిహేనో తేదీన కేసీఆర్ క్లాసులను ప్రారంభించబోతున్నారు. గత ఏడాదే ఎనిమిది మెడికల్ కాలేజీలను ఒకే రోజు ప్రారంభించారు. ఈ ఏడాది మరో తొమ్మిది కాలేజీలను ప్రారంభిస్తున్నారు. మొత్తం ప్రభుత్వ రంగంలోనే. అంటే రెండేల్లలోనే పదహారు కాలేజీలు ప్రారంభమమవుతున్నాయి. మరి ఏపీలో ఎన్ని ప్రారంభిస్తున్నారు ?. మూడు అంటే మూడు కాలేజీలు ప్రారంభిస్తూ.. అందు కోసం ఏకంగా యూనివర్సిటీకే వైఎస్ఆర్ పేరు పెట్టేసుకున్నారు. 2019లో కేంద్రం ప్రతి జిల్లాకు మెజికల్ కాలేజీ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది.
దానికి తగ్గ ప్రతిపాదనలు పంపిన వారందరికీ పర్మిషన్ ఇచ్చింది. అయితే ఏపీ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఉమ్మడి జిల్లాలనే పరిగణనలోకి తీసుకున్నారు. ఫలితం మూడు మెడికల్ కాలేజీలకే అనుమతి వచ్చింది. కానీ ఏపీ ప్రభుత్వం మత్రం పదిహేను మెడికల్ కాలేజీలు కడతామని ఒకే రోజు మూడేళ్ల కిందట శంకుస్థాపన చేసింది. సీఎం జగన్ చేసిన శంకుస్థాపన శిలాఫలకాలు ఎక్కడివక్కడే ఉన్నాయి. అతి కష్టం మీద మూడు మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తున్నారు. కానీ ఈ పేరు మీద కార్పొరే,న్ ఏర్పాటు చేసి భారీ ఎత్తున అప్పులు తెచ్చుకున్నారు. ఇప్పుడు పెడుతున్న మూడు కాలేజీల్లోనూ సామాన్యులకు అందకుండా ఫీజులను ఖరారు చేశారు. మరో వైపు పీజీ సీట్ల స్కాములను ఉన్న కాలేజీల్లో షురూ చేసి వందల కోట్లు బొక్కేస్తున్నారు.
ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ఏపీ పరువు తీసింది. అయినా పాలకులకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. ఏమీ పని చేయకపోయినా.. ఫలానా పని చేశామని వందల కోట్లతో ప్రచారాలు మాత్రం చేసుకుంటున్నారు. ఎలాంటి ఫుల్ పేజీ ప్రకటనలు ఇవ్వకుండానే కేసీఆర్ తాను అనుకున్నది చేసుకుంటూ పోతున్నారు. ఏపీ విద్యార్థులు వైద్య విద్య కోసం కూడా రాష్ట్రం దాటిపోవాల్సి వస్తోంది. అన్ని మెడికల్ కాలేజీలు ప్రారంభించినా… ఫీజులు భారం మోయలేక వలస పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.