చంద్రబాబుపై ఇటీవలి కాలంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కేశినేని నేని తాజాగా ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇండియా పాలిటిక్స్ లో అవినీతి మరక అంటని కొద్ది మందిలో చంద్రబాబు ఒకరన్నారు. ఈ రాష్ట్రం కోసం 40 ఏళ్లు కష్టపడి అవినీతి మచ్చ లేని వ్యక్తి చంద్రబాబు అని స్పష్టం చేశారు. బెజవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వ్యాఖ్యలు ఈ సారి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఐటీ నోటీసులు సాధారణమేనని.. నోటీసులు వచ్చినా సమాధానం చెప్పుకునే నిబద్దత,కమిట్ మెంట్ చంద్రబాబు వద్ద ఉందన్నారు. నిస్వార్ధంగా అవినీతి మచ్చ లేకుండా రాష్ట్రఆన్ని ఏలిన వ్యక్తి చంద్రబాబు కేశినేని స్పష్టం చేశారు.
నోటీసులు ఇవ్వడం రాజకీయపరమైంది..ఇది చాలా రొటీన్ విషయమన్నరాు. నోటీసులు రాజకీయపరంగా చిన్న ఈక్వేషన్ మాత్రమే డైరీలో చంద్రబాబు తాలూకా Xకి ,Yకి ఇచ్చినట్లు రాసుకుంటారు… అలా రాసుకుంటే చంద్రబాబుకు ముట్టినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. తనకు తెలిసి అలా జరిగి ఉండదన్నారు. కేశినేని నాని ఇటీవలి కాలంలో టీడీపీకి కాస్త దూరంగా ఉంటున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కూడా పాల్గొనలేదు. దీంతో ఆయన టీడీపీకి దూరమవుతారన్న చర్చ జరుగుతోంది. తనకు టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని.. కేశినేని నాని చెబుతున్నారు.
అయితే ఇప్పుడు మాత్రం తన ఐడియాలజీ టీడీపీనేనని అంటున్నారు. తాను టీడీపీ తరపునే పోటీ చేసి మూడో సారి ఎంపీగా పార్లమెంట్ కు వెళ్తానని చెబుతున్నారు. విజయవాడ టీడీపీలో వర్గ పోరాటం ఎక్కువగా ఉంది. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఉంది. అందుకే.. కార్పొరేషన్ ఎన్నికల్లోనూ టీడీపీ ఓడిపోయిందన్న అభిప్రాయం ఉంది. అయితే ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో.. బెజవాడ టీడీపీలో ఎవరికి వారే అన్నట్లుగా పరిస్థితి మారింది. చంద్రబాబు అసంతృప్తిని సర్దుబాటు చేయాల్సి ఉంది. ఈ లోపు కేశినేని నాని అసంతృప్తి సంచలనం సృష్టించింది. మళ్లీ ఇప్పుడు ఆయన సర్దుకున్న సూచనలు కనిపిస్తున్నాయి.