రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏపీ సీఎం జగన్ రెడ్డికి ఏటీఎంలా మారింది. ఎన్ని వేల కోట్లు కావాలంటే అన్ని వేల కోట్లు ప్రతి మంగళవారం వచ్చి డ్రా చేసుకుని పోతున్నారు. ఆదాయంతో సంబంధం లేదు..దేనికి ఖర్చు పెడతారనే లెక్క లేదు.. ఇలా మంగళవారం రావడం.. రెండు, మూడు వేల కోట్లు డ్రా చేసుకోవడం ఆనవాయితీగా మారింది. విచిత్రం ఏమిటంటే.. ఈ రెండు, మూడు వేల కోట్లను కూడా ముందుగానే జగన్ రెడ్డి అప్పుగా తీసుకుంటున్నారు. తమ ఆర్బీఐకే జమ చేస్తున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సర్ంలో ఐదు నెలలు ముగిశాయి. ఆరో నెల పది రోజులు కూడా గడవలేదు.. ఇప్పటికి అధికారికంగా ఆర్బీఐ దగ్గర నుంచి నలభై వేల కోట్లకుపైగా అప్పులు తెచ్చారు. అసలు మొత్తం ఇచ్చిన అనుమతులు ముఫ్ఫై వేల కోట్ల వరకే ఉన్నాయి. అయినా నలబై వేల కోట్ల వరకూ ఎలా అప్పులు తెచ్చారో ఆర్బీఐకి.. కేంద్రనికే తెలియాలి. ఇక వేరే కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులు ఇరవై వేల కోట్లకుపైగానే ఉన్నాయి. ఈ ఐదు నెలల్లో ఏపీకి పన్నుల ద్వారా ఆదయం 40 వేల కోట్లు వస్తే.. అప్పులు మాత్రం అరవై వేల కోట్లు చేశారు.
ఇంత దారుణంగా ఆర్థిక పరిస్థితి ఉన్నా.. ఎందుకు విచ్చలవిడిగా ఆర్బీఐ ద్వారా రుణాలను కేంద్రం ఇప్పించడానికి అనుమతి ఇస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. జగన్ రెడ్డితో రాజకీయ సంబంధాలు బాగుంటే బాగుండవచ్చు కానీ.. ఇలా అడ్డగోలుగా అప్పులు ఇచ్చి రాష్ట్రాన్ని ముంచడం ఏమిటన్న వాదన ఆర్థిక నిపుణుల్లో వినిపిస్తోంది. కానీ ఎవరు పట్టించుకుంటారు ?