చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో విశాఖలో గంటా శ్రీనివాసరావు,ఆయన కుమారుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను కూడా స్కిల్ కేసలో అరెస్ట్ చేశారని ప్రచారం చేశారు. అదే లీకులు ఇచ్చారు. మొదట దిశా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత ఆయనకు ఏమీ చెప్పలేదు. విద్యా శాఖ మంత్రిగా ఉండటంతో స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయననూ అరెస్ట్ చేశారని.. ఆయన కుమారుడికి ఏవో నిధులు అందాయన్నట్లుగా చెప్పారు. అయితే అసలు అలాంటిదేమీ లేదని సాయంత్రానికి తేలింది.
చంద్రబాబును అరెస్ట్ చేస్తన్నందున.. ప్రివెంటివ్ అరెస్ట్ చేసినట్లుగా చెప్పి స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. గవర్నర్ అపాయింట్ మెంట్ ఉన్నప్పటికీ ఆయనను వదిలి పెట్టలేదు. రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఇక .. అదుపులో ఉంచుకోవడం సాద్యం కాదు కాబట్టి.. స్టేషన్ బెయిల్స్ ఇచ్చి నేతల్ని విడుదల చేస్తున్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్.. అనేది లేకుండా పోయిందని.. ప్రతిపక్ష నేతలపై పూర్తి స్థాయిలో పోలీస్ ఫోర్స్ ను ప్రయోగిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. న్యాయస్థానాల ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదు. మార్గదర్శిపై కుట్రపూరితంగా ఆ సంస్థను ఆర్థికంగా దెబ్బతీయాలని చూశారు. ఇప్పుడు చిట్లు పాడుకుని ఎగ్గొట్టాలని.. సందేశం ఇస్తూ.. డిఫాల్టర్లతో కేసులు పెట్టిస్తున్నారు. టీడీపీ నేతలపై దాడులు చేసి.. లవారిపైనే హత్యయాత్నం కేసులు పెడుతున్నారు. ఈ వ్యవహారాలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది.