ఓ మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన తీరుపై జాతీయంగా విస్మయం వ్యక్తమవుతోంది. ఇదేం తీరు అని అన్ని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సీఐడీ అరెస్టు చేయడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. చంద్రబాబు అరెస్టు తీరు సరికాదని అన్నారు. మమతా బెనర్జీ సోమవారం మీడియా సమావేశం ఏర్పడి మాట్లాడారు. చంద్రబాబు అరెస్టు సరిగ్గా లేదని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో, చంద్రబాబు పాలన సమయంలో తప్పు జరిగితే విచారణ జరిపించాలని వ్యాఖ్యానించారు. ప్రతీకారంతో ఎవరినీ ఏమీ చేయవద్దని సూచించారు. కమ్యూనిస్టు పార్టీలు నేరుగా ఖండించాయి. లోకేష్ ను కలిశాయి. బీజేపీ నేత లక్ష్మణ్ కూడా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించింది.
కక్ష సాధింపు రాజకీయాలు దేశంలో విపరీతంగా పెరిగిపోయాయన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమంయలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది న్యాయవ్యవస్థేనని .. అంటున్నారు. ఇప్పటి వరకూ దేశంలో ప్రజాస్వామ్యం బతికి ఉందంటే.. వ్యవస్థలు అంతో ఇంతో పని చేయడమేనని .. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా దిగజారిపోతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. చంద్రబాబు ఇటీవలి కాలంలో జాతీయ రాజకీయాల గురించి పట్టించుకోలేదు. బీజేపీకి మద్దతుగానే మాట్లాడుతున్నారు. అయినా మమతా బెనర్డీ ఆయన అరెస్టుపై స్పందించడం … కక్ష సాధింపు రాజకీయాలు ఉండకూడదన్న ఉద్దేశంతోనేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.
చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ పార్టీలు అన్నింటికీ ఒకే రకంగా వ్యతిరేక అభిప్రాయం ఉండటం … చివరికి భిన్న ధృవాలైన బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ వంటి పార్టీలు కూడా ఖండించడం ఆసక్తికరంగా మారింది.