పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి గుంటూరు వైసీపీ మేయర్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా చర్చనీయాంశమవుతున్నాయి. జగనన్నా.. జగనన్నా అని పొద్దున లేస్తే ప్రతి క్షణం మాట్లాడుతూంటారు.. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు. ఆయన వేసే ఫ్లెక్సీల్లోనూ అలాగే ఉంటుంది. కానీ పవన్ కల్యాణ్ అన్నలాగా నిలబడ్డారని లోకేష్ అంటే… కావటి మనోహర్ నాయుడు.. అంటే పవన్ చంద్రబాబునాయుడుకు పుట్టారా అని కామెంట్ చేశారు. మరి తాను పదే పదే జగన్ రెడ్డిని జగనన్నా అంటానని ఎందుకు గుర్తుంచుకోలేకపోయారోనని జనసేన వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
ఆకురౌడీ రాజకీయనాయకుడు అయితే ఇంతే !
గుంటూరులో కావటి మనోహర్ నాయుడు.. చిరంజీవి, పవన్ కల్యాణ్ అభిమానిగా ప్రచారం చేసుకుని బ్లాకులో టిక్కెట్లు అమ్ముకుని.. దందాలు చేసే ఓ ఆకురౌడీగా చాలా మందికి తెలుసు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా వైసీపీ రౌడీల పార్టీ కాబట్టి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి పార్టీలో చేర్చేసుకున్నారు. ఆయన వ్యవహారాలపై పూర్తి స్థాయి సమాచారం ఉండటంతో… జగన్ రెడ్డి బాగానే ప్రోత్సహించారు. ముందుగా పెదకూరపాడు ఇంచార్జ్. కానీ రియల్ ఎస్టేట్ సౌండ్ పార్టీ దొరికే సరికి పక్కన ఈ ఆకు రౌడీని పక్కన పడేశారు. చివరికి గుంటూరులో కార్పొరేటర్ టిక్కెట్ దక్కించుకుని .. తన అర్హతలు చూపించి మేయర్ పదవి పొందారు.
రెండున్నరేళ్ల పదవీ కాలం కోసమే !
అసలు ఈ ఈ కావటి మనోహర్ కి పదవి కాలం రెండేళ్లే. అసలు ఈయనకు మొదట పదవి రాకూడదు. పాదర్తి రమేష్ గాంధీ అనే ఆర్యవైశ్య పెద్దాయనకు మేయర్ సీటు హామీ ఇచ్చి.. చాలా వరకూ కార్పొరేషన్ ఎన్నికల్లో ఖర్చు పెట్టించారు. తీరా ఎన్నికలయ్యాక.. ఈయన పెద్దలను ప్రసన్నం చేసుకుని పదవి పొందారు. చెరో సగం పదవి కాలం అని చెప్పి.. బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ ఆ మనోవేదనకు.. పాదర్తి రమేష్ గాంధీ కార్పొరేటర్ గా ప్రమాణం చేయకుండానే చనిపోయారు. ఇప్పుడు మిగతా సగ కాలం పదవిని ఇచ్చేయాలని ఇతర కార్పొరేటర్లు అడుగుతూంటే… హైకమాండ్ కు ఇష్టమైన బూతులతో విరుచుకుపడేందుకు తన పద ప్రయోగం చేస్తున్నారు.
జగనన్నా అని పిలవాలంటేనే అసహ్యం వేసేలా చేసిన గుంటూరు మేయర్ !
మేయర్ వ్యాఖ్యలను బట్టి సీఎం జగన్ ను జగన్ అన్నా అనే వారంతా వైఎస్ రాశేఖర రెడ్డికి పుట్టినట్టు ఒప్పుకుంటారా? అని ఇప్పుడు జనసేన నాయకులు నిలదీస్తున్నారు. లాంటి నోటి దురుసు నాయకులతోనే పార్టీల పరువు పోతుంది. తమ పరువూ పోగొట్టుకుంటారు. కానీ వాళ్లు తాము ఎదుటి నేతల్ని అంటున్నామని అనుకుంటారు.. కానీ తమ మీదకే వస్తాయన్న సంగతిని మర్చిపోతున్నారు.