ఫోన్ నెంబర్లు సేకరించిన వారందరికీ రికార్డెడ్ వాయిస్ పంపిస్తున్నారు. చంద్రబాబు అలా చేసారు.. ఇలా చేశారు అని అబద్దాలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. వందల కొద్దీ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. కానీ ఒక్కరూ… స్కిల్ డెవలప్మెంట్ లో స్కాం జరిగిందన్నదానికి రూపాయి సాక్ష్యం చూపించలేకపోతున్నారు. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టు చూసి న్యాయనిపుణులు సైతం విస్మయానికి గురవుతున్నారు.ఇంత ఘోరమైన రిమాండ్ రిపోర్టులో… మాజీ ముఖ్యమంత్రిని బాధ్యుడ్ని చేసి జైలుకు పంపితే.. ఇక ఏ నిర్ణయంపైనైనా… పదవులు అనుభవించిన ప్రతి ఒక్కరినీ బాధ్యుల్ని చేయవచ్చునని సంకేతాలు పంపినట్లయిందని అంటున్నారు.
ఒక అబద్దాన్ని వంద సార్లు చెబితే నిజం అవుతుందని. .. నియంతల విధానాన్ని వైసీపీ, జగన్ రెడ్డి ప్రభుత్వం పాటిస్తోంది. మీడియా, సోషల్ మీడియాలో కూర్చోబెట్టి.. అవినీతి జరిగింది.. దుర్వినియోగం అయిందని పదే పదే చెబుతున్నారు. కానీ ఎప్పుడు ఎలా దుర్వినియోగం అయింది.. ఎవరు లబ్దిపొందారో మాత్రం చెప్పడం లేదు. కనీసం ఆధారం చూపించడం లేదు. కానీ .. వందలకోట్లు వెచ్చించి చేస్తున్న ఈ ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఇంతగా ఎందుకు ప్రచారం చేస్తున్నారో వాటిని చూసిన వారికీ అర్థం కావడంం లేదు.
క్రిమినల్ పాలకులు అధికారంలో ఉంటే నిజాయతీ పరులు జైలుకు వెళ్తారని.. ఫిడెల్ కాస్ట్రో అన్న వాక్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారంలో లేనప్పుడే వేల కోట్ల దోచుకున్న వ్యక్తి సీఎం అయ్యారు.. ఇసుక దగ్గర్నుంచి లిక్కర్ వరకూ అంతా దోపిడీనే. కళ్ల ముందు కనిపించే దోపీడీ చేస్తున్నారు. అయినా.. మాజీ సీఎంను ..తప్పుడు కేసులో వ్యవస్థల్ని మేనేజ్ చేసి జైలుకు పంపించడం అసాధారణంగా మారింది. జాతీయస్థాయిలో చర్చనీయంశం అవుతోంది.