ఈనెల 28న విడుదల కావాల్సిన సలార్ వాయిదా పడింది. ఈ విషయం చాలా రోజుల క్రిందే చిత్రసీమకు తెలిసింది. కానీ… ఈరోజు సలార్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. నాణ్యమైన చిత్రాన్ని అందించడానికే ఈ నిర్ణయం తీసుకొన్నామని, అభిమానులు అర్థం చేసుకోవాలని సలార్ టీమ్ కోరింది. అయితే… కొత్త రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. సలార్ ఎప్పుడొస్తుందన్న విషయంలో ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. సలార్ రిలీజ్ పై ఆధారపడ్డ మిగిలిన సినిమాలకు ఇది ఇబ్బంది కరమైన వ్యవహారమే. సలార్ కొత్త రిలీజ్ డేట్ బయటకు వస్తే… తదనుగుణంగా తమ సినిమాల రిలీజ్ డేట్లు ప్లాన్ చేసుకోవాలని చాలామంది నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో సలార్ టీమ్ మొండి చేయి చూపించింది. అక్టోబరులో ఈ సినిమా వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడ్డాయి. కానీ.. వ్యవహారం చూస్తుంటే…. నవంబరు, లేదా డిసెంబరులో మాత్రమే సలార్ వచ్చే ఛాన్సు ఉన్నట్టు కనిపిస్తోంది. వీఎఫ్ఎక్స్ పనులు మాత్రమే బాకీ ఉన్నాయా, లేదంటే ఏమైనా సన్నివేశాలు రీ షూట్ చేయబోతున్నారా? అనే విషయంలోనూ క్లారిటీ రావాల్సివుంది.