స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో సీఐడీ తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టును కొట్టి వేయాలని చంద్రబాబునాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ఈ నెల 19 కి వాయిదా వేసింది. దీనికి కారణం కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం గడువు కోరడమే. పూర్తి స్థాయిలో ఆధారాలున్నాయని… అదనీ.. ఇదనీ ఇష్టం వచ్చినట్లుగా బయట ప్రచారాలు చేస్తున్నారు కానీ హైకోర్టుకు సరైన కారణాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు సరుకు లేకుండా పోయిందని బాగానే గుర్తించింది. చంద్రబాబును వీలైనన్ని రోజులు జైల్లో ఉంచాలన్న ప్రణాళికతోనే కౌంటర్ దాఖలుచేయడంలో ఆలస్యం చేసిందని.. వారం రోజులు సమయం కావాలని కోరిందని తెలుస్తోంది.
అయితే ఈ చంద్రబాబు ను సీఐడీ కస్టడీ కి ఇవ్వొద్దంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. సోమవారం వరకూ మినహాయింపు ఇచ్చిన కోర్టు తదుపరి విచారమ మంగళవారం చేపట్టనుంది. క్వాష్ పిటిషన్ అంశంపై పూర్తి వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. చంద్రబాబునాయుడు పై దాఖలైన ఇతర కేసుల్లోనూ బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అలైన్ మెంట్ మార్పు కేసులోనూ కౌంటర్ దాఖలు చేయడానికి సమయం అడిగారు. అసలు తప్పుడు కేసు కాబట్టి.. క్వాష్ పిటిషన్ కోసం ప్రయత్నించాలని చంద్రబాబు లాయర్లు అనుకుంటున్నారు. చంద్రబాబు కొంత కాలం జైల్లో ఉన్నప్పటికీ… తప్పుడు కేసు అని నిరూపించాలన్న లక్ష్యంతో ఉన్నారని అంటున్నారు.
మరో వైపు చంద్రబాబు రిమాండ్ రిపోర్టుపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇలాంటి రిమాండ్ రిపోర్టుతో… ఓ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిపై కేసు పెట్టి అరెస్టు చేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని.. ఇలా అయితే.. పదవి నుంచి దిగిపోయే ప్రతి ప్రజాప్రతినిధిని తర్వాత వచ్చే ప్రభుత్వాలు సులువుగా అరెస్టు చేయవచ్చునని… అంటున్నాయి.