హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు సరైన సమయంలో మద్దతు పలికారు. ఐయామ్ విత్ బాబు అని విప్రో సర్కిల్లో నినదించారు. మధ్యాహ్నం ఒక్క సారిగా విప్రో సర్కిల్లో అన్ని సంస్థల నుంచి ఉద్యోగులు తరలి రావడంతో ఒక్క సారి హడావుడి ప్రారంభమయింది. పోలీసులు కూడా ఊహించలేకపోయారు. అందరూ శాంతియతంగా నిరసన ప్రదర్శన చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఐటీ ఉద్యోగుల నిరసన ఒక్క సారిగా హాట్ టాపిక్ గా మారింది. అంతకంతకూ నిరసనకు వచ్చే వారి సంఖ్య పెరిగిపోవడంతో పోలీసులు హడావుడి వారిని అక్కడ్నుంచి పంపించేందుకు ప్రయత్నించారు.
ఐటీ ఉద్యోగుల్ని ఎవరూ ఆర్గనైజ్ చేయకపోవడంతో ఐయమ్ విత్ బాబు అనే వారే ప్రింట్లు తీసుకుని ప్లకార్డులు తీసుకుని రావడం.. వారికి చంద్రబాబుపై ఉన్న అభిమానాన్ని బయట పెట్టింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యవహారంలో … ఇప్పటికే యువతలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. యువత కోసం చేపట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేయడం .. అందులో రూపాయి కూడా అవినీతి జరిగినట్లుగా ఆధారాలు లేకపోవడంతో యువత రగిలిపోతున్నారు.
అధికారం చేతుల్లో ఉంటే.. క్రిమినల్స్ ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా అని మండి పడుతున్నారు. ఏపీలోనూ ఈ ఉద్యమాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు పెరుగుతూండటం…ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారుతోంది.