ఓడిపోవడం ఖాయం అయిపోయింది. ఇక చివరి ప్రయత్నంగా ప్రత్యర్థులు యుద్ధంలోకి రాకుండా అందర్నీ జైళ్లలో పెట్టి ఎన్నికలకు వెళ్లాలని జగన్ రెడ్డి డిసైడైపోయారు. అందు కోసమే ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారని జోరుగా చర్చ జరుగుతోంది. అందర్నీ జైళ్లలో పెట్టి తనకు మాత్రమే ఓటేయాలని… ప్రజలను కిమ్ తరహాలో బెదిరించి ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నారేమో కానీ.. ఇలాంటి వ్యవహారాలు మన ప్రజాస్వామ్యంలో జరుగుతాయా అంటే… ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను అడ్డుకోలేకపోతున్న వ్యవస్థల్ని చూస్తే.. జరిగినా జరగవచ్చని అనుకుంటారు.
అయితే మనది నిఖార్సైన ప్రజాస్వామ్యం. ప్రజలు ఎవర్ని ఎన్నుకుంటే వారిదే అధికారం. ఆ ప్రజలకు నిర్భయంగా… ప్రలోభాలు లేకండా ఓట్లేసే అవకాశం ఇవ్వకపోతే … ఉన్న అధికారంతో ప్రత్యర్థులపై తప్పుడు కేసులతో విరుచుకుపడితే.. అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది. తాను మాత్రమే యుద్ధంలో ఉండి .. గెలవాలనుకునేవారిని ఏమంటారు ?. ఆయన అలా ఎన్నికల గ్రౌండ్ కు వెళ్తే.. ప్రజలంతా చూసి నవ్వుతారు. అందర్నీ తప్పుడు కేసులతో జైళ్లలో పెట్టి ఎన్నికల ప్రచారానికి వచ్చిన నేతను చూసి.. తేడా మనిషని అనుకుంటారు.
రాయలసీమ పౌరుషాల గడ్డ. ప్రత్యర్థులపై ధైర్యంగా ఎదుర్కొంటారు కానీ.. వాళ్లని అడ్డగోలుగా తప్పించేసుకుని యుద్ధంలోకి వెళ్లి తొడకొట్టరు. కానీ ఇక్కడ జగన్ రెడ్డి వ్యవహారశైలి వేరుగా ఉంది. ఎన్నికల్లో గెలవడానికి చివరికి ప్రత్యర్థులందర్నీ జైళ్లలో పెట్టేందుకూ వెనుకాడటం లేదు. ఇప్పుడు వ్యవస్థలు విఫలమైతే.. మన దేశ ప్రజాస్వామ్యం దారి కూడా మారిపోతుంది. వ్యక్తులు లాభపడవచ్చు కానీ దేశం మాత్రం కొత్త దిశలోకి వెళ్లిపోతుంది.