స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో స్కాం జరిగిందని రెండేళ్ల కిందట నమోదు చేసిన కేసులో రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి.. తర్వాత చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోుద చేశారు. ఆ రిమాండ్ రిపోర్టులో అసలు విషయమే లేదని దాన్ని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి రిజెక్ట్ చేస్తారని అనుకున్నారు. కానీ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయన రాజమండ్రి జైలుకు వెళ్లారు. హౌస్ రిమాండ్‌కూ కోర్టు అనుమతించ లేదు. నిజానికి ఇలాంటి కేసుల్లో రిమాండ్ కు పంపగానే ఎవరైనా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం బెయిల్ పిటిషన్ దాఖలు చేయలsదు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన ఇతర కేసుల్లో బెయిల్ పిటిషన్ల వేశారు కానీ తాను అరెస్టయిన కేసులో మాత్రం బెయిల్ పిటిషన్ వేయలేదు.
బెయిల్ కు దరఖాస్తు చేసుకుని బయటకు వస్తే.. చంద్రబాబు బెయిల్ ఉన్నారని ప్రచారం చేస్తారు. ఆ ఆ కేసు పెట్టి కొంత మందిని అరెస్ట్ చేసి రెండేళ్లు గడిచినా చార్జిషీటు వేయలేకపోయారు. అసలు ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పలేకపోయారని టీడీపీ వర్గాలంటున్నాయి. అదే సమయంలో చంద్రబాబుపై నమోదు చేసిన అభియోగాలు, సెక్షన్లు చెల్లవని. పైగా అరెస్టు కూడా అక్రమం అని టీడీపీ గట్టిగా నమ్ముతోంది. న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఉందని చట్టాలకు వ్యతిరేకంగా ఉన్న రిమాండ్ రిపోర్టును హైకోర్టు తిరస్కరిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.
మరో వైపు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్తున్న చంద్రబాబును కావాలనే అరెస్ట్ చేశారని.. తప్పుడు కేసులో ఇరికించారని ప్రజల నుంచి మద్దతు పొందడానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రజలందరూ చంద్రబాబుకు మద్దతివ్వాలని కోరతూ క్యాంపెయిన్ ప్రారంభించింది. నియోజకవర్గాల్లో నిరాహారదీక్షలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో ఆత్మహత్య చేసుకున్న.. గుండెపోటుతో చనిపోయిన వారి కోసం ఓదార్పు యాత్ర తరహాలో ఓ ప్రచారాన్నీ ప్లాన్ చేయబోతున్నారు. వైసీపీ ప్రభుత్వం కారణంగా నష్టపోయిన తప్పుడు కేసుల్లో ఇరుక్కున్న వారందరినీ ప్రజల ముందుకు తెచ్చి ఏపీలో అధికారం ఎలా దుర్వినియోగం అవుతుందో చూపించాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
మరో వైపు వారం రోజుల పాటు రాజమండ్రి చుట్టూనే రాజకీయం తిరిగే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబుతో పెద్ద ఎత్తున ములాఖత్‌లు జరగనున్నాయి. నేడు పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. చంద్రబాబుకు మద్దతు తెలిపిన జాతీ.య నేతలు… వారి ప్రతినిధులు కూడా ములాఖత్‌లకు వచ్చే అవకాశం ఉంది. ఇది రాజకీయ కక్ష సాధింపు అరెస్టేనని… వైసీపీ వాళ్లు కూడా ప్రచారం చేస్తూండటాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది.