ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు పెంచింది. కవితకు నోటీసులు పంపింది. శుక్రవారం ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. సౌత్ లాబీలో అందరూ అప్రూవర్లు అయ్యారు. నిందితులు అందరూ తాము స్కామ్ చేశామని ఒప్పుకుని అప్రూవర్ అయ్యారు. కవిత ఒక్కరే ఏకాకిగా మిగిలారు. కవిత బినామీగా ఈడీ ప్రకటించిన రామచంద్ర పిళ్లై కూడా అప్రూవర్ అయి మొత్తం ఈడీకి గుట్టు విప్పారు.
ఇటీవల మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా అప్రూవర్ అయ్యారు. మొత్తంగా సౌత్ లాబీ నుంచి ఒక్క కవిత మాత్రమే నిందితురాలిగా ఉండిపోయారు. ఈ క్రమంలో ఈడీ నోటీసులు వచ్చాయి. గతంలోనే అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగింది కానీ పెండింగ్‌లో పడిపోయింది. ఇప్పుడు సమయం వచ్చిందేమో కానీ ఈడీ మళ్లీ వేగంగా ముందుకు కదులుతుంది. అయితే ఈ కేసులో ఈడీ సీరియస్‌గా ఉందా లేదా.. ప్రత్యేకపార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు కోసం కొత్త గేమా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.
శుక్రవారం కవిత ఈడీ ఎదుటకు హాజరైన తర్వాత జరిగే పరిణామాలను బట్టి ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఎందుకు ఉత్సాహం చూపిస్తుందన్నది స్పష్టమవుతుంది. నాలుగు రోజుల్లో ప్రత్యేక పార్లమెంట్ సమవేశాలు ఉన్నాయి. అప్పటికి కవితకు నోటీసుల విషయంలో స్పష్టత వస్తుంది.