నిజంగా నాకు సందేహం… చంద్రబాబు వద్ద మంచి ప్యాకేజీ తీసుకుని ఆయనను తిరుగులేని మెజార్టీతో సీఎం చేయాలని ప్యాకేజీ తీసుకుంది జగనన్నేనా ? . .. అని సోషల్ మీడియాలో ఓ వైసీపీ కార్యకర్త వ్యక్తం చేసిన అభిప్రాయం…. సగటు వైసీపీ అభిమాని ఆలోచనను ప్రతిబింబిస్తోంది. ఎన్నికలకు వెళ్లే ముందు ఐదేళ్లలో ఏం చేశామో చెప్పుకుని వెళ్తాం కానీ ఇలా తప్పుడు కేసులు పెట్టి… ఆధారాల్లేని కేసుల్లో వ్యవస్థల్ని మేనేజ్ చేసి.. . ప్రతిపక్ష నేతల్ని జైల్లో పెట్టి ఏదో సాధించేశామని ప్రజలకు వద్దకు వెళ్తే … దేనితో కొడతారో చెప్పడం కష్టమని అంటున్నారు. 90 శాతం మంది కార్యకర్తల అభిప్రాయం ఇదే. చంద్రబాబుపై వ్యక్తిగత ద్వేషం పెట్టుకున్న కొంత మంది .. జగన్ రెడ్డిని హీరోగా చూస్తున్నారు కానీ… 90 శాతం మందిలో మాత్రం… ప్రభుత్వం మారితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో.. ఊహించలేకపోతున్నామని కంగారు పడిపోతున్నారు.
జగన్ రెడ్డి ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారోనని వైసీపీ ద్వితీయ శ్రేణి క్యాడర్ కూడా ఆశ్చర్యపోతున్నారు. జగన్ రెడ్డి వేల కోట్ల ఆస్తులు అక్రమంగా సంపాదించారు. అవన్నీ కళ్ల ముందు ఉన్నాయి. క్విడ్ ప్రో కో ఎలా జరిగిందో బ్యాక్ స్టేట్మెంట్లతో సహా ప్రజల ముందు ఉంది. పదహారు నెలలు జైల్లో ఉన్నారు. అయినా ఆయన సీఎం అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు అవినీతి చేశారని ఎవరూ నమ్మడం లేదు. సీఐడీ కూడా ఆధారాలు ఉన్నాయని చెప్పడం లేదు . చంద్రబాబుకు రూపాయి అయినా అందిందని చెప్పడం లేదు. దేశవ్యాప్తంగా చంద్రబాబుకు సంఘిభావం లభిస్తోంది. ఇంత ఘోరమైన అరెస్టు చేసి చంద్రబాబుకు లేనిపోని సానుభూతి కల్పించారన్న వాదన వైసీపీ క్యాడర్ లో వినిపిస్తోంది.
ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తులకు కూడా సరైన వేదికను జగన్ రెడ్డినే కల్పించినట్లయింది. పొత్తు పెట్టుకోవాల్సిందేనని లేకపోతే జగన్ రెడ్డి అరాచకాల నుంచి ప్రజలను కాపాడలేరన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో, ప్రజల్లో ఏర్పడే పరిస్థితిని జగన్ రెడ్డి కల్పించారు. అందుకే సీట్ల సర్దుబాటు లాంటి చర్చలు కూడా ప్రారంభించకుండానే రాజమండ్రి సెంట్రల్ జైలు ముందే ప్రకటించారు. ఇంత కాలం టీడీపీతో వెళ్లాలంటే బీజేపీని ఎందుకు దూరంగా పెట్టాలన్న ప్రశ్న వచ్చేది. ఇప్పుడు బీజేపీతో పని లేదన్న అభిప్రాయాన్ని కల్పించారు. ఇదంతా జగన్ రెడ్డి చలువ వల్లే జరిగింది.
ముందు ముందు జగన్ రెడ్డి ఎలాంటి విపరీత నిర్ణయాలు తీసుకుంటారో తెలుసుకాబట్టి.. దాని ప్రకారం… రాజకీయంగా మేలు చేసే వ్యూహాలను జనసేన, టీడీపీ కలిసి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.