జగన్ రెడ్డి ముక్కి మూలిగి నాలుగు మెడికల్ కాలేజీలను … పూర్తి చేయకుండానే ప్రారంభిస్తున్నారు. ఆయన ప్రారంబోత్సవానికి వెళ్తున్న విజయనగరం మెడికల్ కాలేజీలోనే పనులు ఇంకా ముఫ్పై శాతానికిపైగా మిగిలిపోయి ఉన్నాయి. వాటి కన్నా ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు ఇంకా పెద్దగా ఉంటాయి. కానీ వేల కోట్ల అప్పులు మెడికల్ కార్పొరేషన్ నుంచి చేసి… నాలుగు మెడికల్ కాలేజీలకు మాత్రమే అనుమతి తెచ్చుకోగలిగారు. వాటినే ప్రారంభిస్తారు. ఇందులోనూ పేదలకు విద్య అందుబాటులో లేదు.
ఏపీలో జిల్లాలో మెడికల్ కాలేజీ పెడతానని శంకుస్థాపనలు చేసి.. చివరికి అతి కష్టం మీద ఓ నాలుగు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు నిర్వహించడానికి అనుమతి తీసుకు వచ్చారు. కానీ ఈ కాలేజీల నిర్వహణకు ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవట . అందుకే ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఎవరైనా సరే… లక్షల్లో ఫీజులు చెల్లించాల్సిందేనని జీవో ఇచ్చింది. బడుగు బ లహీనవర్గాలకు వైద్య విద్యను దూరం చేసేశారు. ప్రభుత్వ కాలేజీలు ఉన్నది … ప్రజలకు సాయం చేయడానికి. చదువు కొనలేని వారికి అవకాశం కల్పించడానికి. ప్రభుత్వ కాలేజీ అంటే… అతి తక్కువ పీజు ఉంటుందనే నమ్మకంతో ప్రజలు ఉంటారు.
ఏటా అరవై, డెబ్భై లక్షలు ఫీజులు పెడితే ఇక ప్రభుత్వ కాలేజీల్లోనూ సామాన్యులు చదువుకునే పరిస్థితి ఉంటుందా? . ఈ డబ్బులన్నీ కాలేజీల నిర్వహణకు ఖర్చుపెడతామని అంటున్నారు. కాలేజీల నిర్మాణానికి అప్పులు తెచ్చి… నిర్వహణకు ఫీజులు విద్యార్థుల నుంచి భారీగా వసూలు చేస్తే ఇక ప్రభుత్వం చేసేదేంటి ?. అంటే సమాధానం ఉండదు.
తెలంగాణలో కేసీఆర్ ఈ రోజే 9 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్నారు. గత ఏడాదే ఎనిమిది మెడికల్ కాలేజీలను ఒకే రోజు ప్రారంభించారు. ఈ ఏడాది మరో తొమ్మిది కాలేజీలను ప్రారంభిస్తున్నారు. మొత్తం ప్రభుత్వ రంగంలోనే. అంటే రెండేళ్లలోనే పదహారు కాలేజీలు ప్రారంభమమవుతున్నాయి. భారీగా ఖర్చవుతుందోని విద్యార్థుల దగ్గర నుంచే ఫీజులు వసూలు చేయడం లేదు. బడుగు బలహీనవర్గాలకు వైద్య విద్య అందే ఏర్పాట్లు చేశారు. కానీ జగన్ రెడ్డి ఆలోచనలు మాత్రం వేరు. అది బయట ప్రచారం చేసుకునేదానికి భిన్నం.