చంద్రబాబును అరెస్ట్ చేసిన ఉదంతంలో ఎన్టీఆర్ కుటుంబంలో అందరూ స్పందించినా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్లు స్పందించకపోవడంతో.. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ పేరుతో వైసీపీ సోషల్ మీడియా చేసే ఫ్యాన్ వార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారందరికీ ఇప్పుడు ఫుల్ పని దొరికింది. దీనిపై టీడీపీ నేతలకూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
స్కిల్ కేసుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లతో టీడీపీ ఓ వెబ్ సైట్ ఏర్పాటు చేసింది. ఈ వెబ్ బైట్ ప్రారంభ కార్కక్రమంలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. అక్కడ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదని అచ్చెన్నాయును జర్నలిస్టులు అడిగారు. ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయననే అడగాలని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. స్పందించాలని తాము స్పందించాలని ఎవరినీ అడగడం లేదన్నారు. ఎన్టీఆర్ విషంయలో తనను అడిగితే తాను ఏం చెపుతానని అన్నారు. జనసేనతో రాబోయే రోజుల్లో జనసేనతో కలిసి కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ ను జనసేన నేతలు, కార్యకర్తలు ఖండిస్తున్నారని చెప్పారు. టీడీపీ చేపట్టిన దీక్షల్లో జనసేన శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయని తెలిపారు.
చంద్రబాబును అరెస్టు చేయడంపై అందరూ స్పందిస్తున్నారు కానీ.. జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం చర్చనీయాంశమయింది. ఇది రాజకీయంగా మద్దతు ప్రకటించడం కాదని.. కష్టకాలంలో కుటుంబసభ్యునికి అండగా నిలవడం అని.. చాలా మంది విశ్లేషిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత ఓ అవార్డు ఫంక్షన్ కు ఆయన దుబాయ్ వెళ్లారు. జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అయితే ఆ తర్వాత వైసీపీలో పెద్దగా ఎక్కడా కనిపించలేదు. కానీ అంతకు ముందు నుంచే టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్ అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు