శుక్రవారం రాత్రి జాతీయ మీడియాలో నారా లోకేష్ స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిన వైనాన్ని దేశ ప్రజల ముందు పెట్టారు. నేరుగా రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్ గోస్వామితో డిబేట్ కు కూర్చుకున్నారు. సాధారణంగా ఆర్నాబ్‌తో డిబేట్ అంటే… పొలిటిషియన్స్ ఎవరూ ముందుకు రారు. ఇంటర్యూలు కూడా ఇవ్వలేరు. ఇక లైవ్ డిబేట్ అంటే… మనకెందుకు అనుకుంటారు. కానీ నారా లోకేష్ మాత్రం డైరక్ట్ గా కౌంటర్ ఎటాక్ ఇచ్చారు,
ఎదీ లెంగ్తీ క్వశ్చన్ కాలేదు !
ఆర్నాబ్.. స్కిల్ కేసుకు సంబంధించి ప్రతి విషయాన్ని అడిగారు. సిమెన్స్ 90 శాతం భరించడం, 19 రోజుల్లోనే డబ్బులు రిలీజ్ చేయడం గురించి ప్రశ్నించారు. అక్కడ ఏదో తప్పు జరిగిందని.. మెంటల్ లోకేష్ ను ఇబ్బంది పెట్టాలని చూశారు. కానీ లోకేష్ అన్నింటికీ గట్టి సమాధానాలిచ్చారు. సిమెన్స్ ప్రాజెక్టు గురించి వివరించారు. వారిచ్చే 90శాతం ముందుగా గుజరాత్ లోనూ అమలు చేశారన్నారు. అది నగదు సాయం కాదని..సాఫ్ట్ వేర్ .. టెక్నికల్ అని వివరించారు. మొత్తంగా ఆర్నాబ్ ఎంత గ్రిల్ చేసినా… కేసు గురించి సాధికారికంగా మొత్తం చెప్పారు.
బ్రింగ్ ఇట్ ఆన్ !
ఈ కేసు విషయంలో వైసీపీ నేతలతో ఎందుకు బహిరంగ చర్చ చేయడం లేదని ఆర్నాబ్ ఓ సందర్శంలో ప్రశ్నిస్తే… బుర్ర తక్కువ వాళ్లతో … అన్నీ తెలిసీ తెలియనట్లుగా మాట్లాడేవాళ్లతో ఏం మాట్లాడతామని స్పష్టం చేశారు. మరి జగన్ రెడ్డితో చర్చకు రెడీ అంటే… లోకేష్ మరో మాట లేకుండా బ్రింగ్ ఇట్ ఆన్ .. అనే తేల్చి పడేశారు. ఇప్పుడీ డైలాగ్ వైరల్ అవుతోంది. దమ్ముంటే జగన్ రెడ్డి స్కిల్ కేసుపై నారా లోకేష్‌తో చర్చకు రావాలన్న డిమాండ్ బలంగా వినిపించినట్లయింది. ఇప్పుడు జగన్ రెడ్డి ఒప్పుకుంటారా లేదా అన్నది తర్వాత విషయం.
జాతీయ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ నారా లోకేష్
తప్పుడు కేసులు పెట్టి.. చట్టాలను.. వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తే సివిల్ వార్ వస్తుందని.. దానికి సిద్ధపడతామని లోకేష్ బహిరంగంగానే హెచ్చరించారు. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి.. నిర్బంధాలు కట్టుతెగితే ఎవరూ ఆపలేరని గుర్తు చేశారు. నారా లోకేష్ ఢిల్లీ వెళ్లినప్పటి నుంచి హడావుడిగానే ఉన్నారు. హోంమంత్రిని.. లేకపోతే ప్రధానమంత్రిని కలవాలనుకోలేదు. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. మరో రెండు రోజులు ఢిల్లీలోనే ఉండి.. మరికొన్ని జాతీయ మీడియాలకు ఇంటర్యూలు ఇవ్వనున్నారు.