తెలంగాణలో కాంగ్రెస్కు మంచి రోజులు కనిపిస్తున్నాయి. అంతా సాఫీగా పని చేసుకుంటూ పోతోంది. హైకమాండ్ మొత్తం హైదరాబాద్కు దిగి వచ్చి రెండు రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు, భారీ బహిరంగసభతో దేశం మొత్తం తమ వైపు చూసుకునేలా చేయాలనుకుంటున్నారు. ఇందు కోసం కీలక నిర్ణయాలు , ప్రకటల కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అవుతోంది. బహిరంగసభతో బలప్రదర్శన కూడా చేయబోతున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ కు పాజిటీవ్ వాతావరణం ఉందని దానిని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ను ఇప్పటికే గాడిలో పెట్టేశారు. అసంతృప్త వాదుల్ని… బుజ్జగించినట్లుగా బుజ్జగించారు.. లేదంటే ఇక మీ దారి చూసుకోమని పరోక్షంగా చెప్పేశారు. ఇప్పుడు ఎవరికీ వేరే దారి చూసుకునే అవకాశం లేదు. దాంతో అందరూ సర్దుకుని పోతున్నారు. పార్టీలో చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. తుమ్మల నాగేశ్వరరావు చేరుతున్నారు. మరికొంత మంది కీలక నేతలు అదే బాటలో ఉన్నారు.
ఎన్నికలు ఆలస్యమవుతాయని జరుగుతున్న ప్రచారంతో కొంత మంది వేచి చూద్దామనుకుంటున్నారు. పొటెన్షియల్ లీడర్లు అయితే చూద్దామని కాంగ్రెస్ అనుకుంటోంది. ఆదివారం నిర్వహించబోయే విజయభేరి సభను విజయవంతం చేసేందుకు ..కు భారీ జనసమీకరణ చేపట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఇక తిరుగులేదనే సంకేతాలు ఇచ్చేందుకు నాయకత్వం ప్రయత్నిస్తున్నది. మరో వైపు బీజేపీ పూర్తిగా వెనుకబడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ తంటాలు పడుతోంది. ఆ పార్టీలో హుషారు కనిపించడం లేదు.