కళ్ల ముందు కనిపిస్తున్న ఆధారాలను బయట పెట్టినా.. జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఒకటే ప్రచారం చేస్తున్నారు. సిమెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకోలేదని.. రూ. 371 కోట్లు స్కాం జరిగిందని.. చంద్రబాబు డబ్బులు తీసుకున్నారని చెప్పిందే చెబుతున్నారు. అన్ని డాక్యుమెంట్లు.. స్కిల్ సెంటర్లు.. వాటి ద్వారా లబ్ది పొందిన వారు లక్షల్లో కళ్ల ముందు ఉన్నా నమ్మలేకపోతున్నారు. ఓ తప్పుడు కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి.. పైశాచిక అనందం పొందుతూ.. అవే అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. కాపు నేస్తం నిధులు బటన్ నొక్కేందుకు ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగం మరింత శృతి మించింది.
దిగువ కోర్టుకు సాక్ష్యాలు కనిపించాయని .. కోర్టు రిమాండ్ కు పంపిందంటే అవినీతి జరిగిందన్నట్లే కదాఅని చెబుతున్నారు. జగన్ రెడ్డి రూ. 43 వేల కోట్లు దోచుకున్నారని సీబీఐ పదహారు నెలలు జైల్లో పెట్టింది. పదుల సార్లు ఆయన బెయిల్ రిజెక్ట్ అయింది. ఆయన అక్రమ సంపాదన కళ్ల ముందే ఉంది. అన్నీ బినామీ కంపెనీలే. విచారణకు సహకరించడంలేదు. కోర్టుకూ వెళ్లడంలేదు. ఇంత ఘన చరిత్ర పెట్టుకుని యువతకు మేలు చేసిన స్కిల్ ప్రాజెక్టులో.. ఖర్చు అంతా కళ్ల ముందే ఉన్నా.. దోచుకున్నారని ఆరోపిస్తున్నారు.
పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకోవడంపైనా ఆయన ఫీలయ్యారు. ములాఖత్ కు వెళ్లి మిలఖత్ కు వెళ్లారని విమర్శించారు. ప్రశ్నించాల్సిన వాళ్లు ప్రశ్నించలేదన్నారు. రాష్ట్రంలో ఉండకుండా .. లండన్ పోయి చంద్రబాబును అరెస్ట్ చేయించి.. వ్యవస్థల్ని మేనేజ్ చేసిన వ్యవహారంలో మొత్తం బయట పడుతోంది. పొన్నవోలు, సీఐడీ చీఫ్లే మొత్తం గుట్టు తమకు తెలియకుండానే బయటపెడుతున్నారు. ఇప్పటికే .. స్కిల్ ప్రాజెక్టు వివరాలన్నీ ప్రజల్లోకి వచ్చాయి.
అరెస్టు చేసిన విధానం కూడా సైకోతనంతో ఉందన్న విమర్శలు ఆయనకు ఆనందాన్ని కలిగిస్తున్నట్లుగా ఉన్నాయి. మిగతా సందర్భాల్లో నీరసంగాప్రసంగించి చంద్రబాబును తిట్టాల్సిన పార్ట్ చదవడానికి వచ్చినప్పుడు మాత్రం చెలరేగిపోయారు.