కళ్యాణ్ రామ్ కొత్త సినిమా డెవిల్. నవీన్ మేడారం అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. దాదాపు షూటింగ్ పూర్తయింది. ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తిని పెంచింది. కళ్యాణ్ రామ్ కొత్త లుక్ లో ఎదో కొత్తగా ప్రయత్నించారనే నమ్మకం కలిగించింది. ఐతే ఇప్పుడీ సినిమా చుట్టూ ఓ వివాదం రాజుకుంది. ఈ సినిమాని దర్శకుడు నవీన్ ని ఉన్నపలంగా సినిమా నుంచి తీసేశారు.
దర్శకుడు, నిర్మాతకు మధ్య ఏవో క్రియేటివ్ బేధాలు తలెత్తాయి. ఈ సినిమా అభిషేక్ నామా కొంచెం దూకుడు గల మనిషి. మరో ఆలోచన లేకుండా సినిమా నుంచి దర్శకుడు పేరుని తొలగించారు. తాజాగా ఈ సినిమా పాట ఒకటి బయటికి వచ్చింది. దీనికి సంబధించిన ప్రెస్ నోట్లో దర్శకుడి పేరు లేదు. ఆ స్థానంలో అభిషేక్ నామా పేరు వేయించుకున్నారు.
ఏవో కారణాలతో ప్రాజెక్ట్ మధ్యలో నటులు, నిపుణులు తొలగిపోవడం కామనే. కానీ ఏకంగా షూటింగ్ పూర్తయిన సినిమా నుంచి దర్శకుడినే తొలగించేయడం వివాదమే. నవంబర్ లో సినిమా వస్తోంది. విడుదల సమయంలో దర్శకుడు ఖచ్చితంగా న్యాయస్థానాలని ఆశ్రయిస్తాడు. కళ్యాణ్ రామ్ ఇలాంటి వివాదాలకు దూరంగా వుంటారు. త్వరలోనే దర్శకుడిని పిలిపించి ఈ సమస్యకు సామరస్యపూర్వకమైన పరిష్కారం చేస్తారని తెలుస్తుంది.