సైకోలు, పిచ్చి వాళ్లు ఎక్కడో ఉండరు మన చుట్టూనే ఉంటారు. వారి ప్రవర్తనను బట్టి వారికి ఆ ముద్ర పడుతుంది. చెట్టుకొట్టి మీద వేసుకునే వాళ్లను కూడా ఇదే పేరుతో పిలుస్తారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే టీడీపీ ఫినిష్ అని ఆయన అనుకుని ఓ తప్పుడు కేసుతో.. ఏదో చేద్దామని బయలుదేరారు. కానీ మొదట్లోనే ఆ చెట్టు ఆయనపై పడిపోయింది. ఇప్పుడు అటూ ఇటూ కదల్లేని స్థితిలో ఉన్నారు. ఇరుక్కుపోయారు. అంతే.. తన ప్రత్యర్థులకు ఆయన చేసిన మేలు అంతా ఇంతా కాదు. ఇవన్నీ అర్థం చేసుకుంటే జగన్ రెడ్డి సైకోతనం ఆయనను నట్టేట ముంచేసిందని తెలుస్తుంది.
చంద్రబాబుకు భారీ సానుభూతి
చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారని ప్రజల్లోకి వెళ్లిపోయింది. జగన్ రెడ్డి అక్రమంగా వేల కోట్లు సంపాదించారు. ఆ ఆస్తులన్నీ కళ్ల ముందే ఉన్నాయి. తండ్రి సీఎం కాక ముందు సబ్ కాంట్రాక్టుల కోసం కాళ్లావేళ్లా పడిన చరిత్ర గురించి అందరికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు వేల కోట్లకు అధిపతి. అన్నింటకీ ఆధారాలను సీబీఐ కోర్టు ముందు పెట్టింది. అలాంటిది ఏ తప్పు చేయని.. చేసినట్లుగా కనీస ఆధారాలు చూపకుండా మాజీ ముఖ్యమంత్రిని అత్యంత కక్ష పూరితంగా అరెస్టు చేయడం ప్రజల్లో చర్చనీయాంశం అయింది. ఆయన సేవలకు మనం ఇచ్చే ప్రతిఫలం ఇదేనా అన్న చర్చ అంతటా జరుగుతోంది. అందుకే ప్రజలు బయటకు వస్తున్నారు. ఇవాళ..రేపు ప్రజా ఉద్యమాలు జరుగుతాయి. చంద్రబాబుపై ప్రజల్లో ఎంత సానుభూతి వచ్చిందో.. వైసీపీ క్యాడర్ కీ తెలుస్తుంది. ఎందుకంటే ఈ సానుభూతి పరుల్లో వారు కూడా ఉన్నారు.
జనసేనతో పొత్తు కోసం వేదిక
వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డిని ఓడించడానికి టీడీపీ, జనసేన పొత్తులు పెట్టుకోవాలనుకున్నాయి. ఆ పొత్తుల ప్రకటనకు సరైన వేదిక కోసం చూస్తున్నాయి. కానీ జగన్ రెడ్డి .. చంద్రబాబును అరెస్ట్ చేసి అలాంటి వేదిక కల్పించారు. ఈ సైకో నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే ఇక పొత్తులు తప్పదన్న భావనకు వచ్చేలా చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజున పవన్ ను అడ్డుకోవడం.. పవన్ నూ అరెస్టు చేస్తామని మంత్రుల ప్రకటనలు చూసి.. చాలా మంది కి.. ఇక సైకోను తరిమేయాలంటే కలిసిపోరాడటమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారు. వెంటనే.. పవన్ వ్యూహాత్మకంగా పొత్తుల ప్రకటన చేశారు. దాంతో టీడీపీ, జనసేనకు ఓ సమస్య పరిష్కారం అయింది. జగన్ ను ఓడించేందుకు అందరూ ఏకం కావాలని ప్రజలూ అనుకునే పరిస్థఇతి వచ్చింది.
లోకేష్‌కు జాతీయ స్థాయి ప్రాచుర్యం
ఈ కేసు వల్ల చంద్రబాబు వారం .. పది రోజులు జైల్లో ఉండవచ్చు కానీ.. లోకేష్ నాయకత్వ సామర్థ్యం గురించి జాతీయస్థాయిలో ఫోకస్ అయ్యారు. ఇది కూడా జగన్ రెడ్డి పుణ్యమే. ఆర్నాబ్ గోస్వామి ఇంటర్యూ.. జాతీయ రాజకీయాల్లో ఆయనను పాపులర్ చేసింది. ఆర్నాబ్ గురించి తెలిసిన ఎవరైనా.. ఆయన ఇంటర్యూకు పోరు. కానీ లోకేష్ వెళ్లారు. గట్టిగా సమాధానాలిచ్చారు. ఒక్క ఆర్నాబ్ కే కాదు మొత్తం నేషనల్ మీడియాకు ఇంటర్యూలు ఇచ్చారు. ప్రతీ చోటా లోకేష్ వాదన బలంగా వినిపించారు. లోకేష్ ఇప్పుడు .. ఢిల్లీలోనూ టీడీపీ అందికీ పరిచయమైన నేతగా మారారు. ఓ రకంగా ఇది లోకేష్ పొలిటికల్ కెరీర్ కు ఉపయోగపడుతుంది. తనను తాను ఆవిష్కరించుకునేందుకు లోకేష్‌కు ఇంత కన్నా మంచి సందర్భం రాకపోవచ్చు. కానీ ఇది ఇచ్చింది జగన్ రెడ్డి సైకోతనమే.
ఎంత మందిని జైల్లో పెట్టినా టీడీపీని ఏమీ చేయలేరని నిరూపణ
చంద్రబాబును జైల్లో పెట్టారు. ఇక లోకేష్ ను కూడా జైల్లో పెట్టి ఎన్నికలకు వెళ్తాం అని వైసీపీ పెద్దలు అనుకుంటున్నారేమో కానీ.. టీడీపీకి నాయకత్వ లోటే లేదని నారా బ్రాహ్మణి కూడా నిరూపించారు. బాలకృష్ణ ఇప్పటికే పర్యటిస్తున్నారు. నారా బ్రాహ్మణి రాజమండ్రిలో క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించిన తర్వాత మాట్లాడిన మాటలు చూస్తే.. తెలుగుదేశం భవిష్యత్ ఎంత ఉజ్వలంగా ఉంటుందో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. నేతలకు లోటే లేదని.. నాయకత్వానికి సమస్యే రాదని ప్రజలకు స్పష్టత వచ్చింది. ఇదంతా జగన్ రెడ్డి తసుకున్న సైకో నిర్ణయం వల్లే సాధ్యమంది.
మొత్తంగా జరుగుతున్న పరిస్థితుల్ని చూస్తే… పరిపాలించమని ప్రజలు అధికారం ఇస్తే.. వ్యక్తిగత అహాలను సంతృప్తి పరుచుకోవడానికి జగన్ రెడ్డి ఆడుతున్న సైకో నాటకం.. టీడీపీకి ఎంతో ప్లస్ అయింది. జగన్ రెడ్డి తన గొయ్యి తాను తవ్వుకున్నట్లయింది. ఇప్పుడే షో స్టార్టయింది.. అసలు సినిమా ముందు ఉంది.