సీఐడీ ఏం చేస్తుంది ? . ప్రభుత్వం ఇచ్చిన కేసులను దర్యాప్తు చేస్తుంది. నిజానిజాలను వెలికి తీస్తుంది. ఇది అసలు విధి. కానీ ఏపీ సీఐడీ ఏం చేస్తోంది. కేసులు సృష్టిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు సృష్టించడానికి ఎంతటి ఘోరాలకైనా వెనుకాడలేదని ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కనీస సాక్ష్యం లేకపోయినా చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ అంతకు ముందు ఆయన పేరును ఎవరితో ఒకరితో చెప్పించడానికి చేసిన ప్రయత్నాలు వెలుగులోకి వస్తూంటే… ఇంత క్రూరంగా ఉంటారా అని అందరికీ ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.
సుమన్ బోస్కి మొదట రూ. 25 కోట్ల ఆఫర్
రూ. 25 కోట్లు ఇస్తాం. చంద్రబాబు పేరు చెప్పండి. మిమ్మల్ని కూడా ప్రేమ చంద్రారెడ్డి, అజయ్ రెడ్డిల్లా సబంధం లేదని చెప్పి వదిలేస్తామని సీఐడీ పోలీసులు సిమెన్స్ ఇండియా మాజీ ఎండీ సుమన్ బోస్ దగ్గర ప్రతిపాదన పెట్టారని గట్టి ఆరోపణలు వస్తున్నాయి. ఆయన కూడా బయటకు చెప్పలేని నిస్సహాయతతో చిరునవ్వు నవ్వి మీరే అర్థం చేసుకోవాలన్నారు. సీఐడీ అధికారులకు పాతిక కోట్లు ఎక్కడ నుంచి వస్తాయి..? అసలు చంద్రబాబును ఇరికించడానికి సీఐడీ అధికారులకు అవసరం ఏమిటి ? దీని వెనుక ఎవరు ఉన్నారు ?
జైల్లో శవం పక్కన పెట్టి సుమన్ బోస్ కు చిత్రహింసలు
మనుషుల్ని పోలీసులు ఏ రకంగా సినిమాల్లో చూస్తాం. ఇంత ఘోరంగా ఉంటుందా అనుకుంటాం. కానీ సిమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ కు పెట్టిన టార్చర్ గురించి తెలిస్తే… ఏపీ పోలీసులు, సీఐడీ అధికారులు నరరూప రాక్షసుల్లా మారిపోయారని అర్థం చేసుకోవచ్చు. గతంలో సుమన్ బోస్ ను అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్ తెచ్చుకున్నారు. ఈ మధ్యలో జైల్లో ఆయన పక్కన శవాన్ని పెట్టి టార్చర్ పెట్టారు. చంద్రబాబు పేరు చెప్పాలని చిత్ర హింసలు పెట్టారు. ప్రెస్ మీట్లో మీడియా ప్రశ్నలడిగినప్పుడు సుమన్ బోస్ మొహంలో కనిపించిన బాధ దీన్ని స్పష్టం చేస్తోంది. త్వరలో పుస్తకం రాస్తానని సుమన్ బోస్ చెబుతున్నారు.
రెండేళ్లుగా కార్పొరేట్ వ్యక్తికి టార్చర్ – ఏపీ వైపు ఎవరైనా వస్తారా ?
సుమన్ బోస్.. కార్పొరేట్ వర్గాల్లో గొరనీయమైన వ్యక్తి. ఆయన అనేక గొప్ప సంస్థల్లో ఉన్నత స్థానంలో పని చేశారు. ఆయనను తప్పుడు కేసు కోసం రెండేళ్లుగా భయంకరంగా టార్చర్ పెట్టారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకున్నారు. ఇప్పుడు బయటకు వచ్చారు. రేపు కోర్టులో జరిగింది ఏదో చెబితే.. సీఐడీ ఘోరాలు ఇంకా వెలుగులోకి వస్తాయి. అయితే.. సీఐడీ అంత అనాగరికంగా.. . ఓ వ్యక్తిని టార్గెట్ చేసి.. అన్ని కేసుల్లో ఇరికించడానికి చేస్తున్న ప్రయత్నాలే ఢిల్లీ స్థాయిలోనూ సంచలనంగా మారుతున్నాయి.