సోషల్ మీడియాలో ప్రతి వైసీపీ సానుభూతిపరుడు… జీతగాడే. బూతులుతిట్టే వాళ్లకు ప్రత్యేమైన పేమెంట్లు ఉంటాయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాధనంతోనే వీరిని పోషిస్తున్నారు. డిజిటల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసుకుని అందులో జీతాలు ఇస్తూ వందల మందిని నియమించుకున్నారు. చివరికి ఇంటూరి రవికిరణ్ అనే బూతుల కీచకుడు కూడా ఉద్యోగే. అయితే ఇప్పుడు అలా ఉద్యోగాల్లో తీసుకున్న వారిలో రచ్చ మొదలైంది. దానికి కారణం జీతాల్లో తేడాలు.
ఒకరికి లక్ష వరకూ ఇస్తున్నారు…. మరొకరికి ఇరవై మూడు వేలే ఇస్తున్నారు. ఈ తేడాలు బాగా పెరిగిపోవడంతో… తాము ఏమీ తక్కువ అన్న భావనలో వైసీపీ తరపున సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు పెట్టే వారంతా రగిలిపోతున్నారు. కొంత మంది లక్షల్లో జీతాలిస్తున్నామని.. తమకు మాత్రం అతి తక్కువ ఇచ్చి … ఘోరమైన పనులు చేయిస్తున్నరాని అనుకుంటున్నారు. వారం రోజుల కిందట డిజిటల్ కార్పొరేషన్ నుంచి.. వైసీపీ పెయిడ్ కార్యకర్తలకు ఇచ్చే జీతాల లిస్ట్ బయటకు వచ్చింది. ఇది టీడీపీ సర్కిల్స్ లో కన్నా వైసీపీ సర్కిల్స్ లో ఎక్కువగా వైరల్ అయింది.
తమకు ఇంత తక్కువ జీతం ఇస్తున్నారని… ఫలనా వాడికెందుకు ఇంత ఎక్కువ జీతాలని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు.. ఒక్కో కుటుంబంలో ముగ్గురు నలుగురు కూడా పేరోల్స్ లో ఉన్నారని అంటున్నారు. ఈ తేడాలు ఎక్కువగా ఉండటంతో వైసీపీ సోషల్ మీడియాలో జీతాలపై కల్లోలం రేగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం ఆ పార్టీ సోషల్ మీడియాపై ప్రభావం చూపిస్తోంది. వారు డిజిటల్ కార్పొరేషన్ లో జీతాలు తీసుకుంటున్నప్పటికీ చేయాల్సింది మాత్రం వైసీపీ తరపున బూతులే.. ఇప్పుడు వారి పేర్లు కూడా బయటకు వచ్చాయి . దీంతో చాలా మంది భయంతో వణికిపోతున్నారు.
వైసీపీ సోషల్ మీడియా సజ్లల భార్గవ చేతుల్లోకి వెళ్లినప్పటి నుండి వీకైపోతోంది. అంతర్గత లీకులు ఎక్కువగా ఉన్నాయి. ఏదో జరుగుతోదంని.. సజ్జల భార్గవను ఇద్దరు, ముగ్గురు ఓ ఆట