స్కిల్ డెవలప్మెంట్ అనేది లేదని ఏపీ ప్రభుత్వం చేస్తున్నప్రచారంతో… రెండున్నర లక్షల మంది విద్యార్థులు నష్టపోబోతున్నారు. వారిలో ఎంత జీవితాలు రోడ్డున పడతాయో అంచనా వేయడం కష్టంగా మారింది. చంద్రబాబు హయాంమలో ప్రారంభమైన ప్రాజెక్టు 2021 వరూక సాగింది. సిమెన్స్ తో ఒప్పందం అప్పటి వరకే ఉంది . వైసీపీ వచ్చాక కూడా మూడేళ్ళు సిమెన్స్, డిజైన్ టెక్ కలిసి సేవలు ఇచ్చాయి. స్కిల్ సర్టిఫికెట్లుజారీ చేశారు. ప్రచారం చేసుకున్నారు. అయితే ఇప్పుడు అదంతా ఫేక్ అనడం వల్ల ఆ సర్టిఫికెట్లు కూడా ఫేక్ అనే పుకారు ప్రారంభమయింది.
సిమెన్స్ ట్రైనింగ్ వల్ల వచ్చి నస్కిల్ సర్టిఫికెట్లతో ఇప్పటికే లక్ష మందికిపైగా ఎమ్మెన్సీల్లో ఉద్యోగాలు సంపాదించారు. మరో లక్షన్నర మంది ఆ స్కిల్స్ తో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పని వల్ల ఆ విద్యార్థుల భవిష్యత్ అంతా గందరగోళంగా మారింది. అసలు స్కిల్ స్కాంలో నిధుల దుర్వినియోగం జరిగిందని చెప్పడానికి స్కిల్ ప్రాజెక్టులకు తాళం వేశారు. సిమెన్స్ కాంట్రాక్ట్ ముగిశాక.. అసలు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ఆపేశారు. యువతకు అన్యాయం చేస్తున్నారు. అదొక ఘోరం కాగా.. ఇప్పటికే ట్రైనింగ్ తీసుకుని ఉద్యోగంలో ఉన్న వారి బాధ వర్ణనాతీతం.
కక్ష సాధింపుల కోసం ఇప్పటికే రాష్ట్రాన్ని బలి పెట్టేశారు. ఓ ప్రాజెక్టు లేదు.. ఓ అభివృద్ధి లేదు. చంద్రబాబుపై కక్ష సాధింపుల కోసం రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేశారు. వ్యవస్థల్ని దుర్వినియోగం చేశారు. ఇప్పుడు పిల్లల భవిష్యత్‌నూ నాశనం చేస్తున్నారు. ఇంకా చూస్తూంటే… ఏం జరుగుతుందో అంచనా వేయలేనంత క్రిమినల్ మైండ్‌తో పాలకులు ఉన్నారు.