బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం చోటు చేసుకొంది. విజయ్ కుమార్తె లారా ఈ తెల్లవారుఝామున ఆత్మహత్య చేసుకొంది. పదహారేళ్ల లారా చెన్నైలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతోంది. తన నివాసంలోనే ఫ్యానుకి ఉరేసుకొని.. బలవన్మరణానికి గురైంది. చదువు, మార్కులు… ఈ ఒత్తిడి వల్లే లారా ఆత్మ చేసుకొందని ప్రాధమిక సమాచారం. 2006లో ఫాతిమాని వివాహం చేసుకొన్నారు విజయ్. ఇద్దరూ ఆడపిల్లలే. ముఖ్యంగా లారా పుట్టిన తరవాత తనకు బాగా కలిసొచ్చిందని విజయ్ గట్టిగా నమ్ముతుంటారు. బిచ్చగాడుతో ఫేమ్‌లోకి వచ్చిన విజయ్… ఆ తరవాత వరుస పరాజయాలు ఎదుర్కోవాల్సివచ్చింది. ఇటీవలే బిచ్చగాడు 2తో మళ్లీ మరో హిట్ అందుకొన్నారు. ఇంతలోనే… ఇంట్లో తీవ్రమైన విషాదాన్ని చూడాల్సి వచ్చింది.