వైసీపీ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ జంట కవులు ఇద్దరు ఢిల్లీ, హైదరాబాద్లో ఇచ్చిన ప్రజెంటేషన్లను ప్రిపేర్ చేసింది ఎవరు ? మీడియాకు పూర్తి సమాచారం కాకుండా… పాక్షిక సమాచారం పంపిస్తూ.. దాన్ని మాత్రమే ప్రచారం చేయాలని చెబుతున్నది ఎవరు ? యూట్యూబ్ లో కాస్తో కూస్తో వ్యూయర్స్ ఉన్న వాళ్లను పట్టుకుని తాము పంపించిన కంటెంట్ ను స్టోరీగా చేస్తే డబ్బులిస్తోంది ఎవరు ?. మొత్తం ఐ ప్యాకే. డబ్బులకు ఆశపడే వాళ్లంతా అసలు నిజాల్ని దాచి పెట్టి … వారు చెప్పిందే ప్రచారం చేస్తున్నారు.
మీడియా సర్కిల్స్ లో ఇప్పుడు ఐ ప్యాక్ వ్యవహారం సంచలనం అవుతోంది. ఓ లీడింగ్ వెబ్ సైట్ ఐ ప్యాక్ స్కిల్ ప్రాజెక్టు విషయంలో ఇంత క్రియాశీలకంగా ఉందేంటి అని పెద్ద స్టోరీ కూడా రాశారు. చంద్రబాబును ఓ అర్థరాత్రి అరెస్ట్ చేస్తారనే ప్రచారాన్ని వ్యూహాత్మకంగా ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకూ ఓ అబద్దాల్ని.. పాక్షిక నిజాల్ని పదే పదే ప్రచారం చేయడానికి వారు కొన్ని వందల కోట్ల బడ్జెట్ కేటాయించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత మంది ఎన్ని రకాలుగా లబ్ది చేశారో… జర్నలిస్టులకు … ఓ మాదిరి మీడియా సంస్థలకు ఎంత పెద్ద ప్యాకేజీలు ఇచ్చారో బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
ఈ కేసులో ఐ ప్యాక్ తప్పుడు ప్రచారం కాంట్రాక్ట్ ను తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు సంతకాలు ఉన్నాయని చెబుతారు.. అది తప్పన్న అభిప్రాయం కల్పిస్తున్నారు. ఎలా తప్పని చెప్పారు. నోట్ ఫైల్స్ లో పీవీ రమేష్ డబ్బులు రిలీజ్ చేయవద్దన్నారని కానీ చంద్రబాబు ఒత్తిడితో రిలీజ్ చేశారని ప్రచారం చేస్తున్నారు. కానీ డబ్బులు రిలీజ్ చేసిన ప్రేమచంద్రారెడ్డిని అసలు అరెస్ట్ చేయడం లేదా ప్రశ్నించడం చేయలేదు. ఎందుకు చేయలేదనే ప్రశ్నలు రానీయడం లేదు.
స్కిల్ ప్రాజెక్టులో ఎంత మంది ట్రైనింగ్ తీసుకున్నారో బయటకు రానీయడం లేదు. ఒప్పందం ప్రకారం సరుకు అంతా సరఫరా చేశారో లేదో బయటకు రానీయడం లేదు. కేబినెట్ ఆమోదం లేదని తప్పుడు ప్రచారం చేశారు… సిమెన్స్ కు సంబంధం లేదని తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇదంతా ఐ ప్యాక్ చేస్తోంది. అసలు ఇందులో రూపాయి స్కాం లేదు కానీ.. ఏదో జరిగిందని నమ్మించడానికి వందలకోట్లు ఖర్చు పెడుతున్నారు.. అసలు స్కాం ఇదేనన్న ఆరోపణలు మీడియా సర్కిల్స్ లో బలంగా వినిపిస్తున్నాయి.