రూపాయి అవినీతికి ఆధారాల్లేకపోయినా సరే తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్ష నేతల్ని అరెస్టు చేయడానికి సీఐడీకి పూర్తి స్కిల్ ఉంది. జోకర్ల మాదిరిగా ఊరూవాడా తిరిగి ఎలాంటి ఆధారాలు లేవని నేరుగానే చెబుతూ..తప్పుడు ప్రచారం చేస్తున్న సీఐడీ పెద్దలు ఓ కేసులో క్వాష్ పిటిషన్‌పై విచారణ పూర్తి కాగానే మరో కేసును తెరపైకి తెచ్చారు. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో రూ.121 కోట్ల నిధులు గల్లంతయ్యాయని సిట్ చెబుతోంది. ఈ కేసు కూడా ఇప్పటిది కాదు. అధికారంలోకి వచ్చినప్పుడే పెట్టారు. 2019లో పెట్టారు. 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేశారు. ఏ1గా వేమూరి హరి ప్రసాద్, ఏ2 మాజీ ఎండీ సాంబశివరావుగా పేర్కొన్నారు. వారిని అరెస్ట్ చేశారు. ఆ కేసులో అందరూ బెయిల్ పై విడుదలయ్యారు. ఇంత వరకూ దర్యాప్తులో ఏం తేల్చారో తెలియదు. చార్జిషీటు కూడా వేయలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు పాత్ర గుర్తించామని పగతో పిచ్చి పట్టిన వారిలా.. పీటీ వారెంట్లతో బయలుదేరారు. చంద్రబాబుకు వేమూరి హరిప్రసాద్ అత్యంత సన్నిహితుడని సీఐడీ చెబుతోంది. అందుకే చంద్రబాబు పాత్రను సీఐడీ గుర్తించిందని చెబుతున్నారు.
అసలు సన్నిహితుడనేదానికి అర్థం ఏమిటో కానీ..ఎవరు కావాలంటే వారికి చంద్రబాబు సన్నిహితుడని పేరు పెట్టేస్తారు. సన్నిహితుడయితే.. ఎక్కడ నేరం జరిగిందో చెప్పాలి చంద్రబాబుకు ఎక్కడ లబ్ది జరిగింది.. ప్రభుత్వానికి ఎక్కడ నష్టం జరిగింది ఇవన్నీ చెప్పకుండా.. ఏదేదో వాదిస్తూ ఉంటారు. ఈ కేసులోనూ చంద్రబాబుపై నిందలేమిటంటే.. టెర్రా సాఫ్ట్‌కు అక్రమ మార్గంలో టెంబర్లు ఇచ్చారట. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ గడువు వారం రోజులు పొడిగించారట. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న టెర్రా సాఫ్ట్‌కు టెండర్ దక్కేలా మేమూరి చక్రం తిప్పారట. ఫైబర్ నెట్ ఫేజ్-1లో రూ.320 కోట్లకు టెండర్లు వేయగా.. రూ. 121 కోట్లు గల్లంతయ్యాయట. ఇలాంటి కబుర్లతోనే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు అది క్వాష్ పిటిషన్ దగ్గరకు వచ్చే సిరకి.. ఫైబర్ నెట్ అంటూ బయలుదేరారు. అధికారం ఇచ్చింది… అందరిపై తప్పుడు కేసులతో విరుచుకుపడటానికన్నట్లుగా సీన్ మరిపోయింది. పైగా వీటిని అసెంబ్లీలో చర్చిస్తారట.