ఏపీ సీఎం జగన్ రెడ్డి నిడదవోలుసభలో చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని సమర్థించుకుంటూ వాట్సాప్ చాట్లు,, ఈ మ్యాట్లను ప్రస్తావించారు.. కానీ ప్రభుత్వ న్యాయవాదులు కోర్టులో ఈ మ్యాట్ల గురించి ప్రస్తావించలేదు. పైగా తమ దగ్గర చంద్రబాబు తప్పు చేశారని నిరూపించేలా ఒక్క డాక్యుమెంట్ కూడా లేదని నేరుగా న్యాయమూర్తిగా చెప్పారు. లాయర్ రంజిత్ కుమార్ చేసిన వాదనల్లో అసలు తప్పు ఏం జరిగిందో… ఆ తప్పులో చంద్రబాబు పాత్ర ఎక్కడుందో ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. చివరకి జగన్ రెడ్డి చెప్పిన ఈ మ్యాట్లు కూడా చూపించలేదు.
పగతో రగిలిపోతున్న జగన్ రెడ్డికి వంత పాడుతున్న అధికారులు తప్పుడు పనులు చేస్తూ… అడ్డగోలుగా ఇరుక్కుపోతున్నారు. ఇప్పటికే విచ్చలవిడిగా తప్పులు చేసిన వారు ఎన్నికలకు ముందు మరింతగా గీత దాటుతున్నారు. కనీస ఆధారాలు లేకుండా కేసులు పెట్టడం దగ్గర్నుంచి అందర్నీ అరెస్ట్ చేస్తామనే దాకా చెలరేగిపోతున్నారు. వీరందరి భవిష్యత్ ఎలా ఉంటుందో కానీ జగన్ రెడ్డి మాటలు విని… ఆయన అహన్ని తీర్చేందుకు మాత్రం తమ జీవితాల్ని రిస్కులో పెట్టుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది.
ఆధారాల్లేని కేసులో అరెస్టు చేసినందున ఇవాళ కాకపోతే రేపైనా అధికారులు తగిన శిక్ష అనుభవించాల్సిందే. దేశంలో న్యాయవ్యవస్థను అధికారులు తక్కువ అంచనా వేస్తున్నారు. పాలకుల మైండ్ గేమ్ లో బలి అవుతున్నారు. వచ్చే ఎన్నికలకు ముందు రాజకీయ ప్రత్యర్థుల్ని అంతమొందించమని జగన్ రెడ్డి ఆదేశించినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. మరి దీన్ని అధికారులు పాటిస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏ మాత్రం చట్ట నిబంధనలు పాటించని అధికారులు… సాక్ష్యాలు లేకుండా చేసే అరెస్టులతో .. దేశ ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెబుతున్నారు.
కానీ మన ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో.. ఇలాంటి అధికారులు.. అధికార నియంతలకు వ్యవస్థలు చాటి చెబుతాయి. తర్వాత ఎవరూ ఇలాంటి సాహసాలు చేయకుండా బుద్ది చెబుతాయి.