ఏపీ మంత్రివర్గంలో ఓ విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు. ఇది చూడటానికి విచిత్రంగా ఉంటుంది కానీ తెర వెనుక మాత్రం భారీ కుట్ర కనిపిస్తోంది. ఏపీలో ఉండే ప్రైవేటు యూనివర్శిటీలు.. ప్రపంచంలో ఉన్న టాప్ వంద యూనివర్శిటీతో ఖచ్చితంగా ఒప్పందాలు చేసుకోవాలట. అలా చేసుకుని కంబైన్డ్ సర్టిపికెట్లు జారీ చేయాలట. లేకపోతే.. ఆ యానివర్శిటీలు సర్దుకోవాల్సిందేనని మంత్రి వర్గ తీర్మానం ఉద్దేశం. ప్రపంచంలో టాప్ వంద యూనిర్శిటీలు ఏ ర్యాంకుల ప్రతిపాదక చూస్తారో కానీ.. అసలు ఆ యూనివర్శిటీలతో ఎందుకు ఒప్పందాలు చేసుకోవాలన్నది మాత్రం క్లారిటీ లేదు.
కానీ దీని వెనుక ఉన్న పరిణామాల క్రమం చూస్తే.. స్కాం ఏంటో అర్థమైపోతుంది. ఇటీవల విజయసాయిరెడ్డి .. తాను విదేశాలకు వెళ్లడానికి పర్మిషన్ కావాలని కోర్టులో పిటిషన్ వేశారు. దానికి ఆయన చెప్పిన కారణం ఏమిటంటే.. యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకోవడానికి వెళ్లడం. ఏ యూనివర్శిటీలతో ఒప్పందాలు చేసుకుంటారు.. ఏ యూనివర్శిటీల కోసం చేసుకుంటారనే వివరాల్లేవు. కానీ కాస్త ముందుకెళ్తే.. విశాఖలో ఓ కొండను.. విజయసాయిరెడ్డి కబ్జా చేసేశారని బయటపడింది. ఆ కొండపై ఓ ప్రైవేటు యూనివర్శిటీ పెట్టేందుకు విజయసాయిరెడ్డి కుమార్తె రెడీ అవుతున్నారు. అంటే విజయసాయిరెడ్డి కుమార్తె ప్రైవేటు యూనివర్శిటీ పెట్టబోతోంది. అందు కోసం కొండ కొట్టేశారు.. ఆ యూనివర్శిటీ కోసం ఇతర యూనివర్శిటీల పీక నొక్కే ప్రణాళికలు వేస్తున్నారు.
ఇప్పుడు తాము ప్రపంచ టాప్ వంద యూనివర్శిటీలతో ఒప్పందాలు చేసుకుని యూనివర్శిటీలు పెడుతున్నాం కాబట్టి అందరూ అలాగే ఒప్పందాలు చేసుకుంటేనే యూనివర్సిటీ నడుస్తుందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా ఏపీలో ప్రైవేటు యూనివర్శిటీలకూ కూడా.. జగన్ రెడ్డి ముహుర్తం పెట్టేశారన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతానికి కేబినెట్ లో ఆమోదించారు. అసెంబ్లీలో పూర్తి బిల్లు రానుంది. అప్పుడు క్లారిటీ వస్తుంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో చిన్న స్కూల్స్ సహా.. ఇంజినీరింగ్ విద్య వరకూ దేన్నీ వదలకుండా నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి ఇప్పుడు ప్రైవేటు యూనివర్శిటీల మీద పడుతున్నారు.