ఆంధ్రప్రదేశ్ బీజేపీలో పురందేశ్వరి ఒంటరి అయ్యారు. వైసీపీ అక్రమాల్ని ఖండించడానికి… ఖండిస్తూ ఆమె చేస్తున్నప్రకటల్ని సమర్థించడానికి ఒక్కరూ ముందుకు రావడ ంలేదు. ఏపీలో మద్యం పేరుతో కుంభకోణం జరుగుతోందని పురందేశ్వరి కీలక లెక్కలు వెల్లడించారు. ఏటా రూ.36,700 కోట్ల సొమ్ము గల్లంతవుతుందని ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే నిజానిజాలు వెలుగు చూస్తాయన్నారు. అంతకు ముందు అప్పులపై తీవ్ర విమర్శలు చేశారు. కానీ ఆమెకు మద్దతుగా మరో నేత నోరు విప్పలేదు.
ఏపీ బీజేపీకి చెందిన సీనియర్ నేతలంతా సైలెంట్ మోడ్ లో ఉన్నారు. సోము వీర్రాజు నుంచి జీవీఎల్ నరసింహారావు వరకూ ఎవరూ నోరు మెదపడం లేదు. గతంలో జీవీఎల్ ప్రతి వారాంతంలో హడావుడి చేసేవారు. విశాఖలో కచ్చితంగా ప్రెస్ మీట్లు పెట్టేవారు. ఇప్పుడు ఆయన కూడా సైలెంట్ అయ్యారు. సత్యకుమార్ లాంటి నేతలు కూడా ఏపీ రాజకీయాలపై మాట్లాడటం తగ్గించారు. పురందేశ్వరి వ్యవహారశైలి కారణంగానే వీరంతా సైలెంట్ అయిపోయారని … వైసీపీపై ఘాటుగా విరుచుకుపడటం వారికి నచ్చలేదంటున్ారు.
పురందేశ్వరిని టార్గెట్ చేసి విజయసాయిరెడ్డి వంటి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సోమ వీర్రాజు ఉంటే ఎంతో బాగుండేదంటున్నారు. పురందేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. పురందేశ్వరిని టార్గెట్ చేసినా ఎవరూ మాట్లాడటం లేదు.అాలాగే బండి సంజయ్ పై పేర్ని నాని కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కానీ ఏపీ బీజేపీ నుంచి అంత స్పందన రాలేదు. ఎవరూ కౌంటర్ ఇవ్వలేదు. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా సేవా పఖ్వాడా కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర పార్టీ పిలుపునిచ్చింది. కానీ ఎక్కడా చేయడం లేదు. మొత్తంగా ఏపీ బీజేపీ…అంటే పురందేశ్వరి మాత్రమే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.