జగన్ రెడ్డిని నమ్మి నట్టేట మునిగిపోయారు సీపీఎస్ ఉద్యోగులు. ఇలా సీఎంగా ప్రమాణం చేయగానే అలా వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ రెడ్డి హామీ ఇచ్చారు. తీరా కుర్చీ ఎక్కా సీపీఎస్ రద్దు చేయమన్న వారిపై కేసులతో విరుచుకుపడ్డారు. చివరికి సీపీఎస్‌కు బదులు జీపీఎస్ తెస్తున్నామని… వారి అనుమతి లేకుండానే చట్టం చేసేస్తున్నారు. ఇది ఉద్యోగులకు మరింత నష్టం చేకూర్చనుంది. సీపీఎస్ రద్దు చేయకుండా…జీపీఎస్ అమలు చేయడం వల్ల ఉద్యోగులపై మరింత భారం పడుతుంది.
సీపీఎస్ రద్దు చేయడం అంటే.. ఉద్యోగుల జీతం నుంచి మినహాయిస్తున్న పది శాతాన్ని కట్ చేయకుండా ఇచ్చేయాలి. ఆ తర్వాత పాత పెన్షన్ ప్రయోజనాలు కల్పించాలి. కానీ ఇక్కడ ఉద్యోగుల జీతం నుంచి సీపీఎస్ పేరుతో మినహాయించుకుంటున్న మొత్తాన్ని .. ఇక ఉద్యోగుల ఖాతాలకే బదిలీ చేస్తామని చెప్పడం లేదు. ఇప్పటి వరకూ కత్తిరించిన పది శాతాన్ని ఇస్తామని చెప్పడం లేదు. కానీ.. సీపీఎస్ రద్దు చేసేశాం జీపీఎస్ తెస్తున్నాం అని ప్రచారం చేస్తున్నారు. పైగా ఇప్పుడు గతంలో జీతంలో పది శాతం మొత్తాన్ని సీపీఎస్ ఖాతాలో వేస్తారు.. ఇప్పుడు జీపీఎస్ పేరుతో పధ్నాలుగు శాతం చేస్తారన్న అనుమానాలు ఉద్యోగుల్లో ఉన్నాయి.
పాత పెన్షన్ పథకం ప్రకారం.. ఉద్యోగుల జీతంలో రూపాయి కూడా తీసుకోరు. అలా కాకుండా ఉద్యోగుల జీతంలో పది శాతం తీసుకుని ఏది అమలు చేసినా.. పేరు ఏది పెట్టినా అది సీపీఎస్సేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తప్పుడు ప్రచారాలు… ఫేక్ పాలనతో నాలుగేళ్లుగా ప్రభుత్వం ప్రజలందర్నీ మోసం చేస్తూనే ఉంది. ఇప్పుడు సీపీఎస్ రద్దు చేసేశామన్న హమీ నెరవేర్చామని చెప్పుకునేందుకు ఈ వేషాలు ప్రారభించింది. నమ్మిన వాళ్లే గొర్రెలన్నమాట. జగన్ రెడ్డి చేస్తున్న మోసాన్ని ఉద్యోగులు జీవిత కాలంలో మర్చిపోయే అవకాశం లేదు.