ఈ 28న వస్తోంది రామ్, బోయపాటి శ్రీనుల స్కంద. ఇప్పటికే సినిమా టీజర్ ట్రైలర్ పాటలు అన్నీ వదిలేశారు. బాలకృష్ణ అతిధిగా ప్రీరిలీజ్ ఈవెంట్ తరహలో ఓ వేడుక కూడా జరిగింది. ఇక జరగాల్సింది టీం సభ్యులు సినిమా గురించి మాట్లాడటమే. ఐతే ఈ విషయంలో ఇప్పటివరకూ మౌనముద్రలో వుంది స్కంద టీం. ఒక్క ఇంటర్వ్యూ కూడా జరగలేదు. ఈ సినిమాతో పాటే వస్తుంది పెదకాపు. దీనికి సంబధించిన ప్రమోషన్స్ బాగనే జరుగుతున్నాయి. కెమరామెన్ చోటా కె నాయుడుతో మొదలుపెడితే.. సినిమాలో కీలక పాత్రలు పోహిస్తున్న తనికెళ్ళ భరణి, అనసూయ.. ఇలా దాదాపు అందరూ మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు.
కానీ స్కంద టీంలో ఎలాంటి చలనం లేదు. స్కంద నిర్మిస్తున్న శ్రీనివాస్ చిట్టూరి పెద్ద నిర్మాతే. బోయపాటితో మొదలుపెడితే రామ్, శ్రీలీల .. ఇలా చాలా మందిస్టార్ కాస్ట్ వుంది ఇందులో. ఒకొక్కరు ఒక రోజు చొప్పున సమయం కేటాయించినా విడుదల తేదికి సమయం సరిపోకపోవచ్చు. కానీ ఇప్పటివరకూ స్కంద టీం ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదు. బహుసా మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది ప్లాన్ చేసి, సినిమా విడుదలైన తర్వాత టాక్ ని బట్టి మీడియా ముందుకు రావాలని డిసైడ్ అయ్యారేమో.