‘ఉప్పెన’ సినిమాతో ఒక్కసారి స్టార్ హీరోయిన్ కేటగిరీలో కి వెళ్ళిపోయింది కృతిశెట్టి. నిజంగా ఒక ఉప్పెనలానే ఆమెకు అవకాశలు దక్కాయి. కానీ విజయాలు మాత్రం రాలేదు. ఇండస్ట్రీ విజయాలే కీలకం. అందం, అభినయం ఎంత వున్నా విజయాలు రాకపోతే ఒక నెగిటివ్ ముద్రపడిపోతుంది. ఇప్పుడు కృతి శెట్టి విజయంలో కూడా అదే జరిగింది. ఉప్పెన తర్వాత చేసిన బంగార్రాజు, వారియర్, మాచర్ల, ఆ అమ్మాయి గురించి, కస్టడీ .. ఇవన్నీ ఫ్లాపులే. మధ్యలో శ్యామ్ సింగారాయ్ సినిమా ఉన్నప్పటికీ అందులో కృతిశెట్టి ఒక హీరోయిన్ అని ఎవరికీ గుర్తుండదు కూడా. ఆ క్రెడిట్ అంతా సాయి పల్లవికి వెళ్ళిపోయింది.
వరుస అపజయాల ప్రభావంతో కృతికి అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు కృతి ఖాతాలో ఓ మలయాళం సినిమా తప్పితే మరొకటి లేదు. ఇలాంటి సమయంలో ఓ ప్రామెసింగ్ ఆఫర్ ఆమె తలుపు తట్టింది. శర్వానంద్ హీరో శ్రీరాం ఆదిత్య తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్ గా కృతిశెట్టిని ఎంపిక చేశారు. శర్వా, కృతి కలిసి నటించడం ఇదే తొలిసారి. గ్రాఫ్ డౌన్ అయిపోతున్న సమయంలో ఈ ఆఫర్ ఆమెకు మళ్ళీ బూస్ట్ ఇచ్చినట్లయింది.