అసెంబ్లీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి గట్టిగా పదిహేను మంది ఉన్నారు. వారిలో ఐదుగురు సైలెంట్ గా ఉంటారు. మహా అయితే గట్టిగా ఓ పది మంది టీడీపీ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. కానీ వీరికి కూడా సమధానం చెప్పలేక వైసీపీ నైతికంగా మరోసారి పతనం అయింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించిన తర్వాత టీడీపీ సభ్యులు చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై స్పీకర్ పోడియం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు.
మేగర నాగార్జున,అంబటి రాంబాబు బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ కూడా రివర్స్ కౌంటర్ ఇచ్చారు. మీసాలు తిప్పి తొడకొట్టి హెచ్చరించారు. ఇలాంటి దాని కోసం చూస్తున్న అంబటి రాంబబు , మేరుగ నాగార్జున చెలరేగిపోయారు. ఇష్టారీతిన మాట్లాడారు. ఈ సందర్భంలో స్పీకర్ తీరు మరింత వివాదాస్పదమయింది. ఓ టీడీపీ సభ్యుడిని యూజ్ లెస్ ఫెలో అని తిట్టడమే కాకుండా.. టీడీపీ సభ్యులను చుట్టు ముట్టిన వైసీపీ సభ్యులను.. ఉద్దేశించి.. మన వాళ్లు అంతా వెనక్కి రావాలని పిలుపునిచ్చారు.
స్పీకర్ అంపైర్ లాంటి వారు. కానీ…ఆయన వైసీపీ తరపునే వ్యవహరిస్తున్నానని చెప్పకనే చెబుతున్నారు. ప్రతిపక్ష సభ్యుల్ని అవమానిస్తున్నా ఆయన నోటి వెంట మాట రాదు. పట్టుమని పది మంది సభ్యులకు సమాధానం చెప్పలేని దుస్థితికి అధికార పార్టీ దిగజారిపోయిందన్న విమర్శఅలు వస్తున్నాయి. అప్పటికీ పయ్యావుల, అనగాని సత్యప్రసాద్, కోటంరెడ్డిలను ఈ సెషన్ మొత్తం నుంచి ముందుగానే సస్పెండ్ చేశారు. మిగతా వారిని ఈ రోజు వరకూ సస్పండ్ చేశారు. ఎన్ని సార్లు సమావేశాలు జరిగినా.. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడం.. తమ సోది అంతా తాము చెప్పడం కామన్ గా మారింది. తిడితే పడి ఉంటామని అనుకుంటే సాధ్యం కాదని.. బాలకృష్ణ.. అసెంబ్లీ సమావేశం తర్వాత హెచ్చరించారు.
అసెంబ్లీ అంటే ప్రజాస్వామ్య దేవాలయం. ఆ స్థానాన్ని వైసీపీ నేతలు అవమనిస్తూ ఉన్నారు. అతి తక్కువ సంఖ్యాబలం ఉన్న ప్రతిపక్షాల్ని వేధించి.. బెదిరించి.. తిట్టి చివరికి సస్పెండ్ చేసి సభను నడుపుకుంటున్నారు.