అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ని ఈరోజు కేంద్ర ఎన్నికల కమీషనర్ నసీం జైది వెల్లడించారు. అన్ని రాష్ట్రాలలో నేటి నుండి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని చెప్పారు. అన్ని రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి మే 19న జరుగుతుంది.
తమిళనాడు: మొత్తం నియోజక వర్గాలు: 234. నోటిఫికేషన్: ఏప్రిల్ 22. పోలింగ్ తేదీ: మే 16న.
కేరళ: మొత్తం నియోజక వర్గాలు: 140. నోటిఫికేషన్: ఏప్రిల్22, పోలింగ్: మే16న.
పుదుచ్చేరి: మొత్తం నియోజక వర్గాలు: 30. నోటిఫికేషన్: ఏప్రిల్ 22. పోలింగ్ తేదీ: మే 16న.
పశ్చిమ బెంగాల్: మొత్తం నియోజక వర్గాలు: 294. నోటిఫికేషన్: మార్చి 11, 21,22,28, ఏప్రిల్ 1, 4, 11వ తేదీలు. పోలింగ్ తేదీలు: ఏప్రిల్ 4, 11, 17,21,25,30, మే 5వ తేదీలలో పోలింగ్ జరుగుతుంది.
అసోం: మొత్తం నియోజక వర్గాలు: 126. నోటిఫికేషన్: మార్చి 11, 14; పోలింగ్ తేదీలు: ఏప్రిల్: 4,11 తేదీలలో పోలింగ్ జరుగుతుంది.