పార్టీ నేతలను ప్రజల్లోకి పంపడానికి వైసిపి సిద్ధమౌతోంది. దీనికోసం ‘పల్లెకు పోదాం’ పేరుతో ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. నెలాఖరులో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రకారం ప్రతి మండలంలో పార్టీ మండలాధ్యక్షులు రోజుకో సచివాలయం పరిధిలో తిరిగి, రాత్రికి అక్కడే బసచేస్తారు. లబ్ధిదారులతో సహపంక్తి భోజనాలు కూడా ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ప్రభుత్వ పథకాలు పొందిన లబ్దిదారులను కలిసి జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అందించినవేనని, రానున్న ఎన్నికల్లో మీ సహకారం కావాలని కోరాలని పార్టీ నేతలు విజ్ఞప్తితో కూడిన బెదిరింపులకు దిగనున్నారు. లబ్ధిదారుల జాబితాను తయారు చేస్తున్నారు ఒక్కో కుటుంబానికి ఎన్ని పథకాలు అందాయి? ఎంతమేర లభ్ధి చేకూరింది? అనే విషయాలను నమోదు చేసి లబ్దిదారులకు ఇస్తారు. అక్కడే రుణపడి ఉన్నాం అనే పత్రంపైనా సంతకాలు తీసుకోనున్నారు.
గ్రామాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో వైసీపీ నేతలకు బాగా తెలుసు. రూపాయి ఇచ్చి పది రూపాయలు దోచుకున్నారన్న ఆగ్రహంతో ప్రజలు ఉన్నారు. దీంతో పార్టీ నేతలు ఎంత మంది జనంలోకి వెళ్తారన్న సస్పెన్సే. నిజానికి ఈ ప్రోగ్రాం ముందుగా జగన్ రెడ్డి కోసం డిజైన్ చేసింది. ఆయన ప్రజల్లోకి వెళ్తారని… చెప్పుకున్నారు. కానీ జగన్ రెడ్డికి జనంలోకి వెళ్లేందుకు ధైర్యం చాలడం లేదు. అందుకే ఆయనను మినహాయించి పార్టీ నేతల్ని పంపించాలనుకుంటున్నారు.