ఓ నోటీసు ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్లో పేరు లేదు. అప్పటికప్పుడు అరెస్ట్ చేశారు. ఆధారాలు చూపించకుండా జైల్లో పెట్టారు. రాజ్యాంగాన్ని , న్యాయాన్ని నా హక్కులను కాపాడాలి అని ఏసీబీ కోర్టు జడ్జితో చంద్రబాబు అన్నారు. రెండు వారాల రిమాండ్ ముగియడంతో వర్చువల్ పద్దతిలో జడ్జి ముందు హాజరు పరిచారు ఈ సందర్భంగా జడ్జి చంద్రబాబుతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన అభిప్రాయాలు చెప్పారు. తననపై ఆరోపణలు వస్తే.. తనకు నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని.. తాను తప్పు చేసినట్లుగా తేలితే అప్పుడు అరెస్ట్ చేయవచ్చని.. కానీ అసలు నిబంధనలకు విరుద్ధంగా, తన హక్కులను కాలరాస్తూ అరెస్ట్ చేశారని అన్నారు.
ఆ సమయంలో జడ్జి మీరు జ్యూషిడియల్ కస్టడీలో ఉన్నారని పోలీసు కస్టడీలో లేరని.. శిక్షగా భావించవద్దన్నారు. మీపై ఇంకా ఆరోపణలే ఉన్నాయి..నిరూపణ కాలేదన్నారు. కస్టడీకి కావాలని సీఐడీ అడుగుతోందని.. ఇవ్వొదద్ని మీ న్యాయవాదులు వాదించారని తెలిపారు. తనది నలభై ఐదేళ్ల సుదీర్గ రాజకీయ జీవితం అని.. ఈ వయసులో తనకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారని చంద్రబాబు జడ్జితో అన్నారు.
తప్పు చేయకండా తాను జైల్లో ఉండాల్సి వచ్చిందన్నారు. ‘‘ నేను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. అన్యాయంగా నన్ను అరెస్టు చేశారు. ఇది నా బాధ, నా ఆవేదన, నా ఆక్రందన. ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు. నామీద ఆరోపణలు మాత్రమే.. నిర్ధారణ కాలేదు. చట్టానికి అందరూ సమానమే… చట్టాన్ని నేను గౌరవిస్తా’’ అన్నారు.