‘పందెంకోడి’, ‘ఆవారా’ వంటి చిత్రాలతో తెలుగువారికి సుపరిచితులైన దర్శకుడు లింగుస్వామి. ఇటీవల రామ్‌తో ‘ది వారియర్’ తీశాడు. ఈ సినిమా పరాజయం పాలైయింది. ఇప్పుడు మళ్ళీ ఓ తెలుగు హీరోతోనే సినిమా చేయాలానే ప్రయత్నంలో వున్నాడు.
నిజానికి సూర్యతో సికిందర్ సినిమా తీసిన సమయంలోనే తెలుగు హీరోల నుంచి లింగుస్వామికి పిలుపులు వెళ్ళాయి. ఇందులో అల్లు అర్జున్ కూడా వున్నారు. లింగుస్వామితో సినిమా చేయాలని అల్లు అర్జున్ చాలా ఆసక్తి చూపించారు. కానీ సికిందర్ ఫలితం లింగుస్వాని వెనక్కి నెట్టేసింది. అల్లు అర్జున్ తో సినిమా ప్రారంభమై ఆగిపోయింది. తర్వాత అల్లు అర్జున్ వేరే లీగ్ లోకి వెళ్ళిపోయారు.
అయితే లింగుస్వామి మాత్రం తన ప్రయత్నాలు వొదులులోవడం లేదు. రామ్ సినిమా నిరాశ పరిచినప్పటినీ మళ్ళీ తెలుగు హీరోతో సినిమా చేయలనే చూస్తున్నారు. ఆయనకి ప్లస్ పాయింట్ ఏమిటంటే.. నిర్మాత సమస్య లేదు. ఎంత అంటే అంత పెట్టే నిర్మాతలు వున్నారు. కావాల్సింది ఆయన కోరుకునే హీరో డేట్స్. లింగుస్వామి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు. ఐతే ఇప్పుడు పరజయాల్లో వున్నారు. ఇలాంటి సమయంలో ఆయనకి ఎవరి డేట్స్ కుడురుతాయో చూడాలి.