కర్నూలుజిల్లాలో ప్రభావవంతమైన నేతగా పేరున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ప్రస్తుతం ఆయన కుమార్తె బైరెడ్డి శబరి బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నరు. రాయలసీమ హక్కుల కోసం ఉద్యమించే నేతగా ఆయనకు పేరు ఉంది. రాయలసీమలో మంచి ఫాలోయింగ్ ఉంది. నందికొట్కూరు సెగ్మెంట్లో 1994, 1999లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ప్రత్యర్థి గౌరు చరితా రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో నందికొట్కూరు ఎస్సీకి రిజర్వ్ అయ్యింది. 2012లో టీడీపీని వీడి రాయలసీమ పరిరక్షణ సమితిని స్థాపించారు.
ఆశించిన స్థాయిలో ప్రజాదారణ లేకపోవడంతో 2018లో కాంగ్రెస్ లో చేరారు. రాష్ర్ట విభజన కారణంతో 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఫ్యాక్షన్ గొడవులు ఉన్న గౌరు వెంకటరెడ్డి పార్టీ కోసం కలిసి పని చేశారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం దక్కలేదు. ఆ తర్వాత తన కుమార్తె డాక్టర్ బైరెడ్డి శబరితో పాటు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కొంత కాలంగా రాయలసీమ వెనుకబాటుతనంపై గళమెత్తుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ర్టంలోని వైసీపీ తీరును ఎండగడుతున్నారు. రాయలసీమకు నీళ్లు, నిధులు, నియామకాలు చేపట్టాలని కోరుతూ అనేక ఉద్యమాలు చేపడుతున్నారు.
ఇప్పుడు ఎన్నికలకు ముందు ఆయన మళ్లీ టీడీపీలో చేరాలనుకుంటున్నారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీలో చేరితే జిల్లా రాజకీయ సమీకరణాల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. టీడీపీ అధిష్టానం బైరెడ్డికి నంద్యాల ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోదంి. చంద్రబాబు విడుదల కాగానే బైరెడ్డి తన అనుచర వర్గంతో పార్టీలో చేరనున్నట్లుగా చెబుతున్నారు.