స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కేసులో తనపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, రిమాండ్ కు తరలించారని.. రిమాండ్ ను కొట్టి వేయాలని చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్ ను మంగళవారం ధర్మాసనం ముందు మెన్షన్ చేసేందుకు సుప్రీంకోర్టు సీజేఐ చంద్రచూడ్ సింగ్ అనుమతి ఇచ్చారు. చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌కు నెంబర్ వచ్చింది కానీ.. విచారణకుతేదీ ఖరారు కాలేదు. దీంతో చంద్రబాబు తరపు లాయర్ సిద్ధార్థ లూద్రా సీజేఐ బెంచ్ ముందు ప్రస్తావించారు. చంద్రబాబు జైలులో ఉన్నందున అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు.
అయితే ఈ రోజు మెన్షన్ లిస్టు లో కూడా చంద్రబాబు పిటిషన్ లేకపోవడంతో వెంటనే విచారణ చేపట్టేందుకు సీజేఐ నిరాకరించారు . మమంగలవారం మెన్షన్ చేసేందుకు అంగీకరించారు. మెన్షన్ లిస్టు ద్వారా వస్తే పూర్తిగా వింటారమన్నారు. ఈ సందర్భంగా సిద్ధార్థ లూద్రా… ఇది ఏపీకి సంబంధించిన విషయమని.. అక్కడ ప్రతిపక్షాలను పూర్తిగా ఆణిచి వేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబునాయుడు ఎన్ని రోజుల నుంచి కస్టడీలో ఉన్నారని సీజేఐ సిద్ధార్థ లూధ్రా ను సీజేఐ ప్రశ్నించారు. ఈ నెల ఎనిమిదో తేదీన అరెస్ట్ చేశారని లూధ్రా సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు.
మంగళవారం మెన్షన్ చేయడానికి అనుమతి ఇస్తే.. ..తక్షణ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉండవచ్చు లేదా.. పూర్తి విచారణకు తేదీని ఖరారు చేసే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. నారా లోకేష్.. ఢిల్లీలోనే ఉండి సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు.