నటి పూనమ్ కౌర్ ఈమధ్య కాలంలో చేసిన ట్వీట్స్ వైరల్ అయ్యాయి. రాజకీయ దుమారం రేపాయి. పూనమ్ ఓ పార్టీలో చేరబోతుందని, ఆ పార్టీకి అనుకూలమైన ట్వీట్స్ చేస్తోందని కొన్ని కథనాలు వచ్చాయి. ఐతే వీటిపై స్పందించింది పూనమ్. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది.
”ఇప్పటివరకూ నేను ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోలేదు. ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాను. స్వయంగా ఆధారంగానే స్పందిస్తుంటాను. ఈ మధ్య కొందరు రాజకీయ నాయకులు వారి ప్రయోజనాలు కోసం నన్ను ఓ పావుగా వాడాలనుకుంటున్నారు. ఇది సముచితం కాదు. గత ఎన్నికల్లో కూడా ఇలాంటి వికృత చేష్టలు చేశారు. ఒక మహిళపై ఇలాంటి కుట్రలు తగవు. దయచేసి నన్ను మీ రాజకీయాల్లోకి లాగొద్దు. ప్రస్తుతం చేనేత, మహిళా హక్కులు కోసం ఉద్యమాలని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్ళే ప్రయత్నంలో వున్నాను. నావైపు నుంచి ఏదైనా ఉప్దేట్ వుంటే నేనే స్వయంగా తెలియజేస్తాను” అని చెప్పుకొచ్చారు పూనమ్.