వైసీపీలో ఉన్న ప్రముఖ కుటుంబం మేకపాటి ఇంట్లో ఆస్తి గొడవలు ప్రారంభమయ్యాయి. మేకపాటి గౌతంరెడ్డి చనిపోయారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి … తన కుటుంబం మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి … తనకు రావాల్సిన ఆస్తిపాస్తులు రాసివ్వకుండా.. తన సోదరుడు రాజమోహన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి మోసం చేశారని అంటున్నారు. తనకు గుండెపోటు రావడానికి కూడా వాళ్లే కారణం అని చెబుతున్నారు. ఆస్తుల పై చర్చించుకునేందుకు బెంగళూరు రమ్మని చెప్పి… వేధించారని అందుకే గుండెపోటు వచ్చిందని చెబుతున్నారు.
మేకపాటి రాజమోహన్ రెడ్డి బడా కాంట్రాక్టర్. ఆయనకు కేఎంసీ పేరుతో కంపెనీ ఉంది. అది కుటుంబ ఉమ్మడి వ్యాపారం . ఇతరులు భాగస్వాములుగా ఉన్నప్పటికీ… మేకపాటి వాటా వరకూ కుటుంబం అంతటికీ హక్కులు ఉన్నాయని చెబుతూంటారు. మరో వైపు ఉదయగరిలో పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. మొదట్లో మేకపాటి సోదరులు ఇద్దరూ కలిసే రాజకీయాలు చేసేవారు. రాజమోహన్ రెడ్డి ఎంపీగా.. చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండేవారు. రాజమోహన్ రెడ్డి వయసు కారణంగా ఆయనను జగన్ పక్కన పెట్టారు. గౌతంరెడ్డిని మంత్రిని చేసినా ఆయన చనిపోయారు.
ఇప్పుడు మేకపాటి కూడా దూరమయ్యారు. తన కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా ఎలా గెలుస్తారో చూస్తానంటున్నారు. ఆయన టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా… తాను టీడీపీలో చేరుతానంటున్నారు. మొత్తంగా మేకపాటి కుటుంబం సంక్షోభంలో ఉందని… అంటున్నారు. విక్రమ్ రెడ్డి రాజకీయాల్లో ఇమడలేరన్న అభిప్రాయం ప్రజల్లో పెరుగుతోంది. దీంతో వచ్చే ఎన్నికలకు మేకపాటి ఫ్యామిలీ గడ్డు పరిస్థితి ఎదుర్కోవచ్చని భావిస్తున్నారు.