స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ మధ్య రీమేక్ సినిమాల మీద పడ్డాడని మీడియా హడావిడి చేసింది. తమిళ కణితన్ సినిమా చూసిన బన్ని ఆ సినిమా మీద మనసు పడ్డాడని దాన్ని తెలుగులో రీమేక్ చేయాలని కూడా అనుకున్నాడని టాక్ వచ్చింది. అయితే సినిమా తెలుగులో రీమేక్ అయ్యేది వాస్తవమే కాని అందులో హీరో అల్లు అర్జున్ కాకుండా రవితేజ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
మాస్ మహరాజ్ రవితేజ కూడా ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించాడట. నకిలీ సర్టిఫికేట్స్ బాఘోతంతో నడిచే ఈ కథ రవితేజను బాగా ఇంప్రెస్ చేసిందట. అందుకే ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. తమిళ మాత్రుక సినిమా కణితన్ ను డైరెక్ట్ చేసిన టి.ఎన్.సంతోష్ తెలుగులో కూడ డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే తెలుగులో తన ఇమేజ్ కోసం కథలో కొన్ని చేర్పులు మార్పులు చేస్తున్నారట చిత్ర యూనిట్.
ప్రస్తుతం చక్రి అనే నూతన దర్శకుడు దర్శకత్వంలో రాబిన్ హుడ్ సినిమా చేస్తున్న రవితేజ లాస్ట్ రిలీజ్ బెంగాల్ టైగర్ తో పర్వాలేదనిపించుకున్నాడు. మరి తెలుగు కణితన్ సినిమాతో రవితేజ ప్రేక్షకులను ఎలా అలరిస్తాడో చూడాలి.