పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధుల్ని దారి మళ్లించిందని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వం పై విచారణ చేసేందుకు కేంద్ర బృందం ఏపీకి వస్తోంది. పార్టీలకు అతీతంగా సర్పంచ్‌లు తమ నిధుల కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. బీజేపీ నేతలు కూడా ఉద్యమాలు చేశారు. ఈ క్రమంలో కేంద్ర బృందం ఏపీకి వస్తూండటం కీలకంగా మారింది. నిజానికి కేంద్ర బృందం పర్యటన చేయాల్సిన పని లేదు. అవేమీ నగదు లావాదేవీలు కాదు. మొత్తం ఆర్బీఐ కనుసన్నల్లో ఉండే ఖాతాల ద్వారానే నడుస్తాయి. పంచాయతీల ఖాతాల్లో జమ చేసిన నగదు.. సర్పంచ్ సంతకం లేకుండా డ్రా చేస్తే సైబర్ నేరం అవుతుది. ఇక్కడ ఏపీ ప్రభుత్వం అదే చేసింది. పంచాయతీల ఖాతాల నుంచి నేరుగా డబ్బులు తీసేసుకుంది. పంచాయతీల్లో పనులు చేయడానికి డబ్బులు లేక.. లక్షలు ఖర్చుపెట్టుకుని గెలిచిన సర్పంచ్‌లు ఇతరులు… తీవ్ర వేదనకు గురవుతున్నారు.
రాష్ట్రంలో 13,369 గ్రామ పంచాయతీలున్నాయి. అందులో మేజర్ పంచాయతీల కన్నా మైనర్ పంచాయతీలే ఎక్కువ. ఇటీవల జనరల్ ఫండ్స్‌తో పాటుగా 14,15వ ఆర్థిక సంఘం నిధులు కూడా తమకు చేరడం లేదని ఆయా పంచాయతీ పాలక వర్గాలు వాపోతున్నాయి. నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీలకు రూ.7659 కోట్లు 14, 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం ఇచ్చింది. ఈ నిధులను పంచాయతీలు ఖర్చు చేసి యూసీలు సమర్పించాలి. ప్రభుత్వం దారి మళ్లించేసుకోవడంతో గ్రామ పంచాయతీలు ఖర్చు చేయలేకపోయాయి. ఈ పరిస్థితిపై కేంద్రానికి వరుస ఫిర్యాదులు రావడంంతో కేంద్ర బృందాన్ని పంపుతున్నారు.
కేంద్ర బృందం… వచ్చి ప్రభుత్వ కనుసన్నల్లో పని చేసి.. వారికి కావాల్సిన నివేదికను రాసేసి వెళ్తే… పంచాయతీలకు అన్యాయం చేసినట్లే. అయితే తమ వేదన వింటారని.. నిజాలను కేంద్రానికి నివేదిస్తారని సర్పంచ్‌లు ఆశ లు పెట్టుకుంటున్నారు. రాజకీయాల పరంగా చూస్తే… కేంద్ర నిధులు దుర్వినియోగం అనే టాపిక్ తీసుకుంటే… వైసీపీ సర్కార్ ను .. కేంద్రం రద్దు చేసి ఉండేదని.. కానీ చూసీ చూడనట్లుగా ఉండటం ..రాజకీయ కారణాలతోనేనని అంటున్నారు. అందుకే ఇప్పుడైనా చర్యలు తీసుకుంటారని ఎవరూ అనుకోవడంలేదు.