బుల్లితెర యాంకర్ గా ప్రయాణం మొదలుపెట్టిన కలర్స్ స్వాతి తర్వాత సినిమాలో కూడా రాణించారు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసినా తర్వాత హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. అష్టా చమ్మా, స్వామిరారా, కార్తికేయ లాంటి విజయాలు ఆమె ఖాతాలో వున్నాయి. అలాగే తమిళ్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.
ఐతే పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించుకున్నారు స్వాతి. ఇటివలే మళ్ళీ యాక్టివ్ అయ్యారు. మొన్ననే సాయి ధరమ్ తేజ్ తో కలిసి సోల్ ఆఫ్ సత్య పేరుతో ఓ ఆల్బమ్ చేశారు. ఇప్పుడు ఆమె ప్రాధాన పాత్రలో మంత్ ఆఫ్ మధు అనే సినిమా వస్తోంది. తాజాగా ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన స్వాతికి వ్యక్తిగతమైన ప్రశ్న ఎదురైయింది.
ఇటివలే స్వాతి విడాకులు గురించి కొన్ని రూమర్స్ వచ్చాయి. ఆమె భర్తతో విడిపోయిందని వినిపించింది. దీనిపై మీడియా సమావేశంలో తనదైన శైలిలో స్పందించింది స్వాతి. ‘‘విడాకులకు సంబంధించి మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం ఇవ్వ. నాకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దానికి కట్టుబడి విడాకులపై నేను స్పందించను. ఇది సినిమా ఈవెంట్, ఇక్కడ ఆ ప్రశ్న అప్రస్తుతం’’ అని చెప్పుకొచ్చారు.