వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని జగన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఆంధ్రాకు ఆయన అవసరం ఏంటి అనే చర్చ ప్రజల్లో పెట్టబోతున్నారు. ఇది నెగెటివ్ టోన్ లో ఉంది. అయినా జగన్ రెడ్డి ఎందుకు ఈ పేరు పెట్టారో కానీ… ప్రజలు ఇంకా ఏం ఉందని నాశనం చేయడానికి జగన్ రెడ్డి కావాలని ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చేసింది.
బటన్ నొక్కడానికే బటన్ రెడ్డే కావాలా ?
తాను ఎంత కష్టం అయినా బటన్లు నొక్కుతున్నానని.. అదొక్కటే చేస్తున్నానని జగన్ చాలా సార్లు చెప్పుకున్నారు. ప్రజల దగ్గర పన్నులు బాది.. ఆస్తులు తాకట్టు పెట్టి లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలకు చిల్లర పడేసే బటన్ నొక్కుతున్నారు. ఇప్పుడు ఆ బటన్లూ పని చేస్తున్నట్లుగా లేవు. దేశంలో ఇతర ప్రాంతాల్లో ఓ కుటుంబ ఖర్చు నెలకు రూ. పదివేలుఇంటే..ఏపీలో పదిహేను వేలు ఉంటోంది. ద్రవ్యోల్బణం దేశంలోనే ఏపీలో అత్యంత ఎక్కువ. రాష్ట్రంలో అరవై శాతం కుటుంబాలకు అసలు పథకాలు అందవు. అందే వారికీ బటన్లు పని చేయడం లేదు. అప్పులు చేయడం తప్ప ఏమీ చేతకాని బటన్ రెడ్డి ఏపీకి అవసరమా ?
ఏపీపునాదుల్ని కదిలించేశారుగా..ఇంకెందుకు బటన్ రెడ్డి !
పోలవరం ప్రాజెక్టును పూర్తిగా పడుకోబెట్టేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కమిషన్లు ఇచ్చే కులపోళ్లకు టెండర్ కట్టబెట్టారు. పనులు ఆలస్యం కావడంతో.. కీలకమైన నిర్మాణాలు.. డయా ఫ్రంవాల్, గైడ్ బండ్ వంటివి దెబ్బతిన్నాయి. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలవరం నిర్మాణం ఒక్క రోజు ఆగితే ఐదు కోట్ల నష్టం వస్తుందని సీఎం కంగారు పడేవారు. ఒక్క రోజు పని ఆగకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. అలాంటిది నాలుగున్నరేళ్లపాటు పనులు జరగలేదు. ఇప్పుడు జరుగుతాయన్న గ్యారంటీలేదు. అసలు ప్రాజెక్టులే ముపు వచ్చింది. ఇక రాష్ట్రానికి గ్రోజ్ ఇంజిన్ లాంటి రాజధానిని వివేకానందరెడ్డిని నరికేసినట్లుగా నరికేశారు. దానికి చంద్రబాబే కారణం అని వాదించడం ప్రారంభించారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో విశాఖలో కబ్జాలు, సెటిల్మెంట్ల రాజధాని చేశారు. పరిశ్రమల్ని తరిమికొట్టి యువతకు ఉపాధి లేకుండా చేశారు. ఇంకేం నాశనం చేయాలని మళ్లీ బటన్ రెడ్డి కావాలి ?
ఏపీలోకి రావాలంటే వీసా, పాస్ పోర్టులు కూడా తేచ్చేశారు .. మళ్లొచ్చి ఇంకేం చేస్తారు ?
రాష్ట్రంలో శాంతిభద్రతలు మిధ్య. ఓ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారంలో ముఖ్యనేత పాత్ర ఉందని ప్రచారం కావడం కన్నా దౌర్భాగ్యం ఉంటుందా ? వ్యవస్థీకృత మాఫియాను ఏపీలో నడుస్తోంది. అసలు ఏపీలో వ్యాపారాలే చేసుకోకుండా ప్రతి రంగాన్ని వేధించారు. సినిమా, నిర్మాణ రంగం, హోటల్స్, విద్యా సంస్థలు.. ఇలా దేన్నీ వదిలి పెట్టలేదు. మీడియా గురించి చెప్పాల్సిన పని లేదు. చివరికి ఫ్లెక్సీలు ప్రింట్ చేసుకుని బతికే వాళ్లనూ వదల్లేదు. ఏపీలో కి రావాలంటే వీసా పాస్ పోర్టులు కావాలన్నట్లుగా సీన్ మార్చేశారు. ఇక వై ఏపీ నీడ్స్ బటన్ రెడ్డి ?