సీఐడీనా ? సీఐడీ అధికారులు వైసీపీ సోషల్ మీడియాలో చేరారో.. వైసీపీ సోషల్ మీడియానే సీఐడీలో ప్రత్యేకం విభాగంగా మారిపోయిందో కానీ తమదైన ప్రపంచంలో బతికేస్తూ.. కొత్త కొత్త పుకార్లు పుట్టిస్తూ.. నీలి, కూలి మీడియాకు పంపిస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ ను అరెస్ట్ చేయబోమని కోర్టుకు హామీ ఇచ్చి.. ఆయన దాఖలు చేసిన పిటిషన్ కు డిస్పోజ్ చేయించిన సీఐడీ అధికారులు బయట మాత్రం అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ వెళ్తున్నామని ప్రచారం చేశారు.
ఇతర కేసుల్లో నూ లోకేష్ కు ఉరట లభించింది. నాలుగో తేదీ వరకూ స్కిల్ కేసులో అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశిచింది. అయితే సీఐడీ అధికారులు ఢిల్లీకి వెళ్లారని .. నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా కనిపించడం లేదని ప్రచారం ప్రారంభించారు. అసలు నోటీసులు ఇవ్వడానికి ఢిల్లీకి వెళ్లడమే చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే నోటీసులు ఎక్కడా నేరుగా ఇవ్వాల్సిన అవసరం లేదు. దూరంగా ఉంటే వాట్సాప్ లో పంపవచ్చు. ఈమెయిల్ చేయవచ్చు. చాలా దారులు ఉంటాయి. కానీ సహకరించడం లేదని కొత్త ప్రచారం చేయడానికే సిల్లీ పోస్టులతో హడావుడి చేస్తున్నారు. వైసీపీ తప్పుడు ప్రచారాలు..వారి సోషల్ మీడియా కార్యకర్తలకే చిరాకు తెప్పిస్తున్నాయి.
వాటికి వారు కూడా రీచ్ ఇవ్వలేకపోతున్నారు. అరెస్ట్ చేయడానికే అయితే.. ఇంత చేతకాని తనం ఎందుకన్న ప్రశ్న వారికీ వస్తుంది. అందర్నీ అరెస్టు చేస్తామని.. చివరికి భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలను కూడా అరెస్ట్ చేస్తామని ప్రచారం చేస్తూండటం.. ఆ పార్టీ నేతల్ని కూడా అసహ్యానికి గురి చేస్తోంది. ఇదేం రాజకీయం అనుకుంటున్నారు.